×
Ad

Jinn Movie : ఈ ‘జిన్’ కాన్సెప్ట్ చాలా మందికి తెలియదు.. జిన్ నిర్మాత కామెంట్స్..

నిర్మాత నిఖిల్ ఎం గౌడ మీడియాతో మాట్లాడుతూ సినిమా గురించి పలు విషయాలు తెలిపారు.(Jinn Movie)

Jinn Movie

Jinn Movie : సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్స్ పై నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన సినిమా ‘జిన్’. చిన్మయ్ రామ్ దర్శకత్వంలో తెరక్కేక్కిన ఈ సినిమాలో అమ్మిత్ రావ్, పర్వేజ్ సింబా, ప్రకాష్ తుమినాద్, రవి భట్, సంగీత.. పలువురు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా డిసెంబర్ 19న రిలీజ్ కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా నిర్మాత నిఖిల్ ఎం గౌడ మీడియాతో మాట్లాడుతూ సినిమా గురించి పలు విషయాలు తెలిపారు.(Jinn Movie)

నిర్మాత నిఖిల్ ఎం గౌడ తన గురించి, సినిమా ఎలా మొదలయిందో చెప్తూ.. బెంగళూరు నుంచి వచ్చాను. ఎక్కువగా తెలుగు సినిమాలు చూసేవాడిని. నటించాలని సినిమాల్లోకి వచ్చి నిర్మాతగా మారాను. నా ఫ్రెండ్స్ ద్వారా చిన్మయ్ రామ్ పరిచయం అయ్యారు. ఆయన చెప్పిన జిన్ కథ, కాన్సెప్ట్ కొత్తగా ఉంది కదా అని నేను నిర్మించాను అని చెప్పారు.

Also See : Esther Anil : గ్రాడ్యుయేషన్ ఫొటోలు షేర్ చేసిన నటి.. ఓ పక్క చదువుతూనే మరో పక్క సినిమాలు..

జిన్ సినిమా గురించి మాట్లాడుతూ.. ఈ సినిమాని కర్ణాటక, ఆంధ్రా బార్డర్‌లో షూట్ చేశాం. నేను సినిమాను చూశాను. కథ విన్నప్పుడు ఏం ఫీల్ అయ్యానో తెరపైనా అదే ఫీలింగ్ కలిగింది. అందరినీ ఈ సినిమా భయపెడుతుంది. ఈ సినిమా విజువల్స్, మ్యూజిక్ కూడా బాగా వచ్చాయి. చిన్మయి రామ్ ఈ సినిమాని బాగా తెరకెక్కించాడు. మేం ఒక కొత్త ప్రయోగం చేసాము. ఈ జిన్ కాన్సెప్ట్ చాలా మందికి తెలియదు. మేం ఈ మూవీలో కొత్త ప్రపంచాన్ని చూపించబోతోన్నాం అని తెలిపారు.

అలాగే.. ప్రస్తుతం కథల్ని వింటున్నాను. కన్నడ, తెలుగు భాషల్లో కంటిన్యూగా సినిమాల్ని నిర్మిస్తాను అని తెలిపారు.

Also Read : Kumar Sanu : విడిపోయిన 31 ఏళ్ళ తర్వాత మాజీ భార్య మీద కేసు వేసిన స్టార్ సింగర్.. 30 లక్షలు ఇవ్వాలంటూ..