Jio Studios : OTTకి ఎంట్రీ ఇచ్చిన జియో.. ఒకేసారి 100 స్టోరీస్ రిలీజ్.. జియో యూజర్స్‌కి పండగేనా?

మూవీ లవర్స్ అంతా ఓటిటి పై ఎక్కువ ఆసక్తి చూపిస్తుండడంతో జియో కూడా ఓటిటి రంగంలోకి అడుగుపెట్టింది. ఎంట్రీ తోనే ఏకంగా 100 స్టోరీస్ ని ప్రకటించింది. అయితే జియో యూజర్స్ కి ఏమన్నా ఆఫర్లు ఉంటాయా?

Jio Studios : OTTకి ఎంట్రీ ఇచ్చిన జియో.. ఒకేసారి 100 స్టోరీస్ రిలీజ్.. జియో యూజర్స్‌కి పండగేనా?

Jio Studios OTT platform launch and 100 stories announced

Updated On : April 13, 2023 / 3:04 PM IST

Jio Studios : ప్రస్తుతం దేశంలో ఓటిటి ట్రెండ్ నడుస్తుంది. థియేటర్ లో సినిమాలు చూడడాని కంటే ఇంటిలో కూర్చొని ఓటిటి సినిమాలు చూసేందుకు ఆడియన్స్ ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఆహా వంటి ఓటిటి ప్లాట్‌ఫార్మ్స్ మంచి ప్రేక్షక ఆదరణ పొందాయి. కేవలం సినిమాలతోనే కాదు వెబ్ సిరీస్, టాక్ షోస్, సింగింగ్ అండ్ రియాలిటీ షోస్ తో ఆడియన్స్ ని అలరిస్తున్నాయి. ఇక ఓటిటి కంటెంట్ పై సినీ ప్రియులు చూపిస్తున్న ఆసక్తిని గమనించిన అంబానీ జియో స్టూడియోస్ (Jio Studios) అంటూ ఒక కొత్త ఓటిటి ప్లాట్‌ఫార్మ్ తీసుకు వస్తున్నాడు.

Mahesh Babu – Ram Charan : పెట్స్ ప్రేమలో పడిపోతున్న హీరో హీరోయిన్లు..

ఈ ఓటిటి లాంచ్ ఈవెంట్ నిన్న నైట్ ముంబై లో జరిగింది. ఈ ఈవెంట్ లో బాలీవుడ్ అండ్ సౌత్ స్టార్స్ హాజరయ్యి సందడి చేశారు. లాంచింగ్ తోనే 100 స్టోరీస్ ప్రకటించి సంచలనం సృష్టించారు. ఇతర నిర్మాణ సంస్థలు నిర్మించిన సినిమాలను జియో స్టూడియోస్ కొనుగోలు చేసి ప్రసారం చేయడంతో పాటు.. సొంత నిర్మాణంలో కూడా సినిమాలు నిర్మించనుంది. అలాగే ఒరిజినల్ వెబ్ సిరీస్ తో ఆడియన్స్ ముందుకు వస్తామంటూ తెలియజేసింది. హిందీ, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ, భోజపురి మరియు సౌత్ భాషల్లో సినిమాలు, వెబ్ సిరీస్ నిర్మించనున్నారు.

Dasara : 110 కోట్ల దసరా.. డియర్ నాని అదిరిపోయింది అంటూ మెగాస్టార్ ట్వీట్!

ఈ క్రమంలోనే జియో స్టూడియోస్ ద్వారా అందుబాటులోకి రాబోతున్న మూవీస్ అండ్ వెబ్ సిరీస్ ని వెల్లడించింది.
షారూఖ్ ఖాన్-స్టార్ డుంకీ (Dunki), వరుణ్ ధావన్‌తో భేదియా 2 (Bhediya 2), స్త్రీ 2 మరికొన్ని సినిమాలతో పాటు లాల్ బట్టి వంటి వెబ్ సిరీస్ కూడా ప్రసారం కానున్నాయి. అయితే ఓటిటి ప్లాట్‌ఫార్మ్ అనేది సపరేట్ యాప్ ద్వారా అందుబాటులోకి రాబోతోందా? లేదా ఆల్రెడీ అందుబాటులో ఉన్న జియో సినిమాస్ లోనే ప్రసారం కానుందా? అనేది క్లారిటీ లేదు. అలాగే జియో సిమ్ వాడే యూజర్స్ కి ఏమన్నా సపరేట్ ఆఫర్లు ఉంటాయా? అనేది చూడాలి.