Joe Russo : RRR లాంటి సినిమాలకు మద్దతు ఇస్తాం.. హాలీవుడ్ డైరెక్టర్ కామెంట్స్..
తాజాగా జో రస్సో స్కాట్లాండ్‌లోని సాండ్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొన్నాడు. ప్రియాంక చోప్రా, రిచర్డ్ మాడెన్ లతో కలిసి సిటాడెల్ ని ప్రమోట్ చేశాడు.

Joe Russo wants to support Indian Movies in Future
Joe Russo : కెప్టెన్ అమెరికా(Captain America), ఎవెంజర్స్(Avengers), గ్రే మ్యాన్.. లాంటి సూపర్ హిట్ హాలీవుడ్(Hollywood) సినిమాలని తెరకెక్కించిన డైరెక్టర్స్ రస్సో బ్రదర్స్(Russo Brothers) ప్రస్తుతం సిటాడెల్ సిరీస్ తో రాబోతున్నారు. గతంలోనే రసో బ్రదర్స్ ఇండియా మార్కెట్ ని ప్రమోట్ చేస్తూ ఇండియన్ సినిమాలని అభినందించారు. ఇక RRR తర్వాత రాజమౌళిని, ఆ సినిమాని పలు మార్లు రస్సో బ్రదర్స్ అభినందించారు. తాజాగా రస్సో బ్రదర్స్ లో ఒకరైన ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ జో రస్సో(Joe Russo) మరోసారి ఇండియన్ సినిమాల గురించి, RRR గురించి మాట్లాడాడు.
తాజాగా జో రస్సో స్కాట్లాండ్‌లోని సాండ్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొన్నాడు. ప్రియాంక చోప్రా, రిచర్డ్ మాడెన్ లతో కలిసి సిటాడెల్ ని ప్రమోట్ చేశాడు. ఈ నేపథ్యంలో జో రస్సో మాట్లాడుతూ.. ఇండియన్ సినిమాలు ప్రపంచంలోనే సినిమా బిజినెస్ లలో అతి పెద్దది. కానీ ఇండియా బయట వారి సినిమాలు ఎక్కువగా ప్రమోట్ అవ్వట్లేదు. RRR లాంటి సాంకేతిక నైపుణ్యం, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్, పౌరాణిక కథలు ప్రేక్షకులని ఆకర్షిస్తాయి. మేము ఇతర సంసృతులను ఇలాంటి సినిమాల నుంచే నేర్చుకుంటాము. ఇలాంటి సినిమాలు ఇండియా నుంచి ఇస్తున్నందుకు ఆ దేవుడికి ధన్యవాదాలు తెలపాలి. మేము ఇండియా సినిమాలకు ఇతర మర్కెట్స్ లో మద్దతు ఇవ్వాలనుకుంటున్నాము. సాధ్యమైనంతవరకు వారి సినిమాలు ప్రపంచవ్యాప్తంగా విస్తృతం అవ్వడానికి ప్రయత్నిస్తాము అని తెలిపారు.
RRR సినిమాతో హాలీవుడ్ డైరెక్టర్స్ ఇండియన్ సినిమాల మీద బాగా గురి కుదిరింది. ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఇలా చెప్పడంతో భవిష్యత్తులో మన సినిమాలు విదేశాల్లో ప్రమోషన్స్ చేయడం మరింత ఈజీ అవుతుందని భావిస్తున్నారు.