Devara : హాలీవుడ్‌ అతిపెద్ద ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ‘దేవర’.. ఆనందంలో ఫ్యాన్స్‌..

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా న‌టిస్తున్న చిత్రం 'దేవ‌ర‌'.

JR NTR Devara is is set for global space beyondfest event

Devara – JR NTR : యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా న‌టిస్తున్న చిత్రం ‘దేవ‌ర‌’. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ పై ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. సెప్టెంబ‌ర్ 27న ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ క్ర‌మంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో బిజీగా ఉంది. ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించిన ఓ వార్త ప్ర‌స్తుతం అభిమానుల్లో జోష్‌ను నింపుతోంది. హాలీవుడ్‌లో జ‌ర‌గ‌నున్న అతిపెద్ద ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో దేవ‌ర మూవీని ప్ర‌ద‌ర్శించ‌బోతున్నారు.

సెప్టెంబర్‌ 25 నుంచి అక్టోబర్‌ 9 వరకు కాలిఫోర్నియాలోని లాస్‌ ఏంజెలిస్‌లో అతిపెద్ద జానర్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ‘బియాండ్‌ ఫెస్ట్‌’ 2024 జరగనుంది. ఈ ఫెస్ట్‌లో ఈజిప్టియన్‌ థియేటర్‌లో సెప్టెంబ‌ర్ 26 సాయంత్రం దేవ‌ర మూవీని ప్ర‌ద‌ర్శించనున్నారు.

VENOM THE LAST DANCE : ‘వెనమ్ – ది లాస్ట్ డాన్స్’ ట్రైల‌ర్.. గూస్ బంప్స్ అంతే

పలువురు హాలీవుడ్ ప్ర‌ముఖుల‌తో పాటు ప్రేక్ష‌కులు ఈ మూవీని చూడ‌నున్నారు. ఇందుకోసం సెప్టెంబ‌ర్ 25న జూనియ‌ర్ ఎన్టీఆర్ అమెరికాకు వెళ్ల‌నున్న‌ట్లుగా తెలుస్తోంది. దీంతో అభిమానులు ఎంతో సంతోషిస్తున్నారు.

ఇటీవ‌ల విడుద‌లైన ఈ చిత్ర ట్రైల‌ర్‌కు విశేష స్పంద‌న వ‌చ్చింది. ఇక ట్రైల‌ర్ ఈవెంట్ కార్య‌క్ర‌మంలో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. సినిమా ఆఖ‌రి 40 నిమిషాలు వేరే లెవెల్‌లో ఉంటాయ‌ని అంచ‌నాల‌ను అమాంతం పెంచేశారు. బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీక‌పూర్ ఈ మూవీతోనే టాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తోంది.

Mathu Vadalara 2 : ‘మత్తు వదలరా 2’ మూవీ రివ్యూ.. సస్పెన్స్‌ కామెడీతో ఫుల్‌గా నవ్వించారుగా..