VENOM THE LAST DANCE : ‘వెనమ్ – ది లాస్ట్ డాన్స్’ ట్రైల‌ర్.. గూస్ బంప్స్ అంతే

సినీ ప్రియులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న మూవీల్లో వెన‌మ్ సిరీస్ ఒక‌టి.

VENOM THE LAST DANCE : ‘వెనమ్ – ది లాస్ట్ డాన్స్’  ట్రైల‌ర్.. గూస్ బంప్స్ అంతే

VENOM THE LAST DANCE Telugu Trailer out now

Updated On : September 13, 2024 / 12:52 PM IST

VENOM THE LAST DANCE Trailer : సినీ ప్రియులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న మూవీల్లో వెన‌మ్ సిరీస్ ఒక‌టి. ఇప్ప‌టికే రెండు భాగాలు విడుద‌ల కాగా సూప‌ర్ హిట్లుగా నిలిచాయి. ఇక ఇప్పుడు ఈ సిరీస్‌లో మూడో భాగం రాబోతుంది. ‘వెనమ్ – ది లాస్ట్ డాన్స్’ పేరుతో వ‌స్తున్న‌ ఈ మూవీ అక్టోబ‌ర్ 25న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. ఈ క్ర‌మంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసింది.

ఈ ట్రైల‌ర్ కూడా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది. టామ్ హార్డీ న‌ట‌న‌తో పాటు వెనమ్ క్యారెక్ట్ చేసే యాక్షన్ స‌న్నివేశాలు హైల‌ట్ గా ఉండ‌నున్న‌ట్లు ట్రైల‌ర్‌ను బ‌ట్టి తెలుస్తోంది. కెల్లీ మార్సెల్ దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రాన్ని సోనీ పిక్చ‌ర్స్ ఇండియా ప్రైవైట్ లిమిటెడ్, మార్వెల్ సంయుక్తంగా నిర్మించాయి.

Mathu Vadalara 2 : ‘మత్తు వదలరా 2’ మూవీ రివ్యూ.. సస్పెన్స్‌ కామెడీతో ఫుల్‌గా నవ్వించారుగా..

సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండియా ప్రత్యేకంగా మ‌న‌దేశంలో వెనమ్: ది లాస్ట్ డ్యాన్స్‌ని 3D, IMAX 3Dలో ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల చేస్తోంది.