Jr. NTR : ఎవరు మీలో కోటీశ్వరులు తో బుల్లి తెరపై సందడి చేయనున్న జూనియర్ ఎన్టీఆర్
గతంలో బిగ్‌బాస్ రియాల్టీ షో కు హోస్ట్ గా వ్యవహరించి షోను సూపర్ హిట్ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తిరిగి చిన్నతెరపై సందడి చేయనున్నారు. ' ఎవరు మీలో కోటీశ్వరులు' అనే రియాల్టీ గేమ్ షోతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు ముందుకు వస్తున్నారు.

Jr Ntr Hosts Evaru Meelo Koteeswarulu Game Show Shooting Starts From 7th July
Jr NTR : గతంలో బిగ్‌బాస్ రియాల్టీ షో కు హోస్ట్ గా వ్యవహరించి షోను సూపర్ హిట్ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తిరిగి చిన్నతెరపై సందడి చేయనున్నారు. ‘ ఎవరు మీలో కోటీశ్వరులు’ అనే రియాల్టీ గేమ్ షోతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు ముందుకు వస్తున్నారు.
ఎవరు మీలో కోటీశ్వరులు షో కు సంబంధించిన ఎపిసోడ్ల షూటింగ్ ఈనెల 7వతేదీ నుంచి అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభం కానుంది. ఇందుకోసం స్టూడియోలో ప్రత్యేకంగా సెట్ వేశారు. ఈ చిత్రీకరణలో ఎన్టీఆర్ పాల్గోంటారు. కొన్ని ఎపిసోడ్ల చిత్రీకరణ తర్వాత ఆగస్టు నెలనుంచి ఈకార్యక్రమం జెమినీ టీవీ చానల్లో ప్రసారం అవుతుంది.
ఇప్పటికే ఈ షో ప్రారంభం కావల్సి ఉన్నా కరోనా వైరస్ లాక్‌డౌన్ కారణాల వలన వాయిదా పడింది. ప్రస్తుతం కరోనా ఉధృతి తగ్గు ముఖం పట్టి రాష్ట్రంలో లాక్‌డౌన్ ఎత్తివేయటంతో నిర్వాహకులు షూటింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రోమోకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
షోలో పాల్గోనే కంటెస్టెంట్ లను ఎంపిక చేస్తున్నారు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలోని ఆర్ఆర్ఆర్ మూవీలో నటించాడు. ఇప్పటికే నిర్మాణం పూర్తిచేసుకున్న ఆర్ఆర్ఆర్ త్వరలో విడుదల కానుంది.