NTR : పాపం ఎన్టీఆర్ పరిస్థితి.. ఓ పక్క వివాదాలు .. ఓ పక్క గాయాలు.. ఓ పక్క డ్రాగన్ వాయిదాలు..
గత కొన్నాళ్లుగా ఎన్టీఆర్ వార్తల్లో నిలుస్తున్నారు. (NTR)
- Saketh U
- Published on- July 29, 2026 / 07:58 AM IST
NTR
NTR : గత కొన్నాళ్లుగా ఎన్టీఆర్ వార్తల్లో నిలుస్తున్నారు. వార్ 2 సినిమా రిలీజ్ ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఓ రేంజ్ లో మాట్లాడి కాలర్ ఎత్తడం, ఆ సినిమాతో పాన్ ఇండియా ఫ్లాప్ చూడటంతో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యారు ఎన్టీఆర్. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమా అనడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. కానీ సినిమా మొదలయిన దగ్గర్నుంచి ఈ సినిమా వాయిదాలు పడుతూనే ఉంది.
ఆల్రెడీ గతంలోనే ఓ సారి ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా షూటింగ్ లో గాయపడి షూటింగ్ వాయిదా పడింది. మరోసారి యుద్ధం ఎఫెక్ట్ వల్ల జార్జియా నుంచి షూటింగ్ మధ్యలోనే ఆపేసి వచ్చారు. మరోసారి కథా చర్చల కోసం షూటింగ్ వాయిదా పడింది. ఇలా వరుసగా డ్రాగన్ సినిమా వాయిదాలు పడుతూనే ఉంది. ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన సినిమా 2027కి వాయిదా పడింది. తాజాగా మరోసారి ఎన్టీఆర్ కి గాయం అవ్వడంతో మళ్ళీ డ్రాగన్ సినిమా షూటింగ్ రెండు నెలలు ఆగిపోయింది. ఎన్నో అంచనాలు పెట్టుకున్న డ్రాగన్ సినిమా ఇలా వాయిదాలు పడుతుండటంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.
ఇప్పటికే కొన్నాళ్ల క్రితం డ్రాగన్ షూటింగ్ లో గాయపడి కోలుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు మళ్ళీ గాయపడ్డారు. భుజానికి గాయం అవ్వడంతో చికిత్స చేయించుకొని రెస్ట్ తీసుకుంటున్నారు. ఈ గాయంతో ఏకంగా రెండు నెలలు రెస్ట్ మోడ్ లోకి వెళ్లిపోయారు ఎన్టీఆర్. దీంతో ఫ్యాన్స్ ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
ఇలా డ్రాగన్ వాయిదాలు, గాయాలతో ఎన్టీఆర్ బాధపడుతుంటే మరోవైపు ఎన్టీఆర్ ఫ్యాన్స్ వల్ల ఎన్టీఆర్ వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల రా ఎన్టీఆర్ అనే సంస్థ ఎంత హడావిడి చేసిందో అందరికి తెలిసిందే. ఎన్టీఆర్ పేరు పెట్టుకొని సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, వంద కోట్లు వసూలు చేసి సేవా కార్యక్రమాలు చేస్తామని, ప్రెస్ మీట్స్ పెడతామని హడావిడి చేసారు. ఇది ఎన్టీఆర్ వరకు వెళ్లడం, ఎన్టీఆర్ పాలిటిక్స్ లోకి వెళ్తారు అని వార్తలు రావడంతో ఎన్టీఆర్ తన టీమ్ ద్వారా ఈ రా ఎన్టీఆర్ సంస్థతో ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు.
Also Read : Chiranjeevi : ఏపీ ప్రభుత్వం కోసం కీలకంగా మెగాస్టార్..? నిజమేనా?
అక్కడివరకు బాగానే ఉన్నా దీనికి రా ఎన్టీఆర్ సంస్థ కౌంటర్ ఇవ్వడం, ఎన్టీఆర్ నే ప్రశ్నించడం, దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ రెండుగా విడిపోయి సోషల్ మీడియాలో కొట్టుకోవడంతో అది పెద్ద వివాదంగా మారింది. అంత వివాదం జరిగాక రా ఎన్టీఆర్ సంస్థ మేము మా సేవలు అన్ని ఆపేస్తున్నాము అని సైలెంట్ అయిపోయారు. ఇలా ఓ రెండు వారాల పాటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ వల్ల ఎన్టీఆర్ వివాదంలో నిలిచారు. ఇలా ఓ వైపు వివాదాలు, మరో వైపు గాయాలు, మరో వైపు డ్రాగన్ వాయిదాలతో పాపం ఎన్టీఆర్ అని అనుకుంటున్నారు అంతా.
