Jr NTR – Rishab Shetty : మరోసారి కన్నడలో మాట్లాడి ఇంప్రెస్ చేసిన ఎన్టీఆర్.. సైమాలో రిషబ్ – ఎన్టీఆర్ సంభాషణ వైరల్..

తాజాగా జూనియర్ ఎన్టీఆర్ దుబాయ్(Dubai) లో జరిగిన సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ 2023(SIIMA Awards) వేడుకలకు హాజరయ్యారు

Jr NTR speaking in Kannada at SIIMA Awards 2023 event with Rishab Shetty video goes viral

Jr NTR – Rishab Shetty :  జూనియర్ ఎన్టీఆర్ RRR సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకొని దేవర(Devara) సినిమాతో బిజీ అయ్యాడు. RRR సినిమా ప్రమోషన్స్ సమయంలో దేశంలో ఎక్కడికి వెళ్తే అక్కడి భాషలో మాట్లాడి ఎన్టీఆర్ అందర్నీ ఆశ్చర్యపరిచాడు. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్ భాషలు మాట్లాడి అక్కడి ప్రేక్షకులని కూడా ఇంప్రెస్ చేశాడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ ఇన్ని భాషలు మాట్లాడటంతో అభిమానులు, తెలుగు ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోయారు.

RRR సినిమా ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ వేరే భాషల్లో మాట్లాడిన స్పీచ్ లు అన్ని వైరల్ అయ్యాయి. ఇక హాలీవుడ్ కి వెళ్తే అక్కడ కూడా ఇంగ్లీష్ అక్కడి యాసలో మాట్లాడి అదరగొట్టారు ఎన్టీఆర్. తాజాగా మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత ఎన్టీఆర్ కన్నడ భాషలో మాట్లాడి అందర్నీ మరోసారి ఆశ్చర్యపరిచారు.

తాజాగా జూనియర్ ఎన్టీఆర్ దుబాయ్(Dubai) లో జరిగిన సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ 2023(SIIMA Awards) వేడుకలకు హాజరయ్యారు. రెండు రోజుల పాటు ఈ అవార్డు వేడుకలు జరుగుతుండగా నిన్న తెలుగు, కన్నడ పరిశ్రమల అవార్డుల వేడుక జరిగింది. ఈ వేడుకలో తెలుగు, కన్నడ సినిమాలకు సంబంధించిన అవార్డులు ఒకేసారి ఇవ్వడంతో రెండు సినిమా పరిశ్రమల నుంచి అనేకమంది ప్రముఖులు వచ్చారు. కాంతార(Kantara) సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హీరో రిషబ్ శెట్టి. సైమా అవార్డుల్లో రిషబ్ శెట్టి కన్నడ బెస్ట్ యాక్టర్ క్రిటిక్స్ అవార్డు గెలుచుకున్నారు.

SIIMA Awards : సైమా అవార్డ్స్‌ 2023 తెలుగు పూర్తి లిస్ట్.. ఏ కేటగిరిలో ఎవరికి బెస్ట్ అవార్డు?

వేదికపై అవార్డు అందుకున్న అనంతరం మాట్లాడుతూ కింద కూర్చున్న ఎన్టీఆర్ కి కూడా కంగ్రాట్స్ చెప్తూ అభినందించాడు. ఈ క్రమంలో హోస్ట్ ఎన్టీఆర్ వద్దకు మైక్ తీసుకెళ్లగా ఎన్టీఆర్ – రిషబ్ శెట్టిల మధ్య కన్నడలో సంభాషణ జరిగింది. ఒకరి సినిమాల గురించి ఒకరు పొగుడుకొని, అవార్డ్స్ అందుకున్నందుకు ఒకర్నొకరు అభినందించుకున్నారు. దీంతో ఎన్టీఆర్ కన్నడలో మాట్లాడిన ఈ వీడియో వైరల్ గా మారింది. ఇక సైమా అవార్డుల్లో ఎన్టీఆర్ RRR సినిమాకు గాను ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే.