Koratala-Jr NTR Movie : కొరటాలతో యంగ్ టైగర్.. ఎన్టీఆర్ రోల్ హైలెట్ అంట..!

జూనియర్‌ ఎన్టీఆర్‌-కొరటాల కాంబినేషన్‌లో కొత్త సినిమా రాబోతోంది. జనతా గ్యారేజ్‌ తర్వాత మళ్లీ ఎన్టీఆర్, కొరటాల శివతో మరో మూవీ చేసేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ మూవీ చేస్తున్నాడు తారక్..

Koratala-Jr NTR Movie : కొరటాలతో యంగ్ టైగర్.. ఎన్టీఆర్ రోల్ హైలెట్ అంట..!

Jr Ntr To Play Student Leader In Koratala Shiva Movie

Updated On : May 1, 2021 / 1:48 PM IST

Koratala-Jr NTR Movie : జూనియర్‌ ఎన్టీఆర్‌-కొరటాల కాంబినేషన్‌లో కొత్త సినిమా రాబోతోంది. జనతా గ్యారేజ్‌ తర్వాత మళ్లీ ఎన్టీఆర్, కొరటాల శివతో మరో మూవీ చేసేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ మూవీ చేస్తున్నాడు తారక్.. మరోవైపు కొరటాల ఆచార్య షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. రెండు మూవీల షూటింగ్ పూర్తి కాగానే కొరటలతో ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రాజెక్టు మొదలుపెట్టే అవకాశం ఉంది.

కొరటాల- ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో వచ్చే మూవీపై అనేక అంచనాలు నెలకొన్నాయి. ప్రత్యేకించి ఎన్టీఆర్ ఎలా చూపించబోతున్నాడనేది హాట్ టాపిక్ గా మారింది. తారక్ లుక్ ఎలా ఉంటుంది? అసలు స్టోరీ ఏంటి? ఇలా ప్రతి ఒక్కటి సస్పెన్స్ తో అభిమానుల్లో ఆసక్తిని రేకిత్తిస్తోంది.

అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి ఆసక్తికరమైన న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది. కొరటాల మూవీలో ఎన్టీఆర్ పొలిటికల్‌ టచ్‌ ఉంటుందని టాలీవుడ్ టాక్ వినిపిస్తోంది. స్టూడెంట్ పాలిటిక్స్ చుట్టూ మూవీ స్టోరీ తిరుగుతుందని తెలుస్తోంది.

ఎన్టీఆర్ స్టూడెంట్ లీడర్ గా కనిపించనున్నాడట.. సినిమాకు ఎన్టీఆర్ రోల్ పెద్ద హైలెట్ అంటున్నారు. రాజకీయాలతో విద్యార్థుల భవిష్యత్తు నాశనమైపోతుందని, అలా జరగకుండా ఉండేందుకు ఒక హీరో ఎలా ఎదుర్కొన్నాడనేది ఈ స్టోరీ.. ఏదిఏమైనా కొరటాల, ఎన్టీఆర్ కాంబినేషన్ లో రాబోయే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.