మెగా హీరో ఈవెంట్‌కు గెస్ట్‌గా ఎన్‌టీఆర్!

  • Publish Date - March 27, 2019 / 06:15 AM IST

ఒకప్పుడు అంటే మెగా హీరోల ఈవెంట్‌కు నందమూరి హీరోలు.. నందమూరి హీరోలు ఈవెంట్‌కు మెగా హీరోలు రావడం అరుదుగా జరిగేది అందులోనూ అభిమానులు వచ్చే ఈవెంట్లు అయితే అసలు అవకాశమే లేదు. కానీ ఇప్పుడు పరిస్థితి మరిపోయింది. ఏకంగా మల్టీ స్టారర్ సినిమాలే వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో ఓ మెగా హీరో సినిమా ఈవెంట్‌కు ఎన్‌టీఆర్ ముఖ్య అతిధిగా హాజరు కాబోతున్నాడట.
Read Also : ‘మహర్షి’ మ్యూజికల్ జర్నీ

మెగా హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘చిత్రలహరి’. కల్యాణి ప్రియదర్శన్.. నివేదా పేతురాజ్ ఇందులో కథానాయికలు. ఈ సినిమాను ఏప్రిల్ 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ క్రమంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపేందుకు మైత్రీ మూవీ మేకర్స్ సిద్ధమైంది. 

అయితే ఈ వేడుకకు యంగ్ టైగర్ ఎన్‌టీఆర్‌ను ముఖ్య అతిధిగా తీసుకుని వచ్చేందుకు మైత్రీ మూవీ మేకర్స్ ప్లాన్ చేసింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల కోరిక మేరకు ఎన్‌టీఆర్ ఈ వేడుకకు రానున్నట్లు చెబుతున్నారు. వాస్తవానికి ఈ వేడుకకి చిరంజీవి కానీ చరణ్ గాని ముఖ్య అతిథులుగా రావచ్చునని తొలుత భావించారు.

అయితే సైరా షూటింగ్‌లో బాగంగా చిరంజీవికి డేట్‌లు అడ్జస్ట్ కాకపోవడం.. చరణ్ ఆ సమయంలో అందుబాటులో ఉండే అవాకాశం లేకపోవడంతో ఈ  ఫంక్షన్‌కు ఎన్‌టీఆర్‌ వస్తే బాగుంటుందని నిర్మాతలు భావించారట. ఇక వరుసగా ఏడు సినిమాల ప్లాప్‌ను మూటగట్టకున్న సాయిధరమ్ తేజ్‌కు ఈ సినిమా కీలకం కానుంది.
Read Also : నాకు బతకడమే ఓ కల : 28న ఐరా