Jug Jugg Jeeyo : మంచి డేట్ ఫిక్స్ చేసుకున్నారుగా..

2022 జూన్ 24న ‘జగ్ జగ్ జీయో’ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు..

Jug Jugg Jeeyo

Jug Jugg Jeeyo: బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అనిల్ కపూర్, యంగ్ స్టార్ వరుణ్ ధావన్ కలిసి నటిస్తున్న సినిమా ‘జగ్ జగ్ జీయో’. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద కరణ్ జోహార్, హిరూ యశ్ జోహార్, అపూర్వ మెహ్తా నిర్మిస్తుండగా.. రాజ్ మెహ్తా డైరెక్ట్ చేస్తున్నారు.

Hrithik-Ranbir : బాలీవుడ్ బిగ్ క్లాష్..

అనిల్ కపూర్‌కి జోడీగా నీతు కపూర్ (రిషి కపూర్ భార్య), వరుణ్ ధావన్‌కి జంటగా కియారా అద్వాణీ నటిస్తున్నారు. లవ్ అండ్ కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న ‘జగ్ జగ్ జీయో’ లో ప్రజక్త కోలి, మనీష్ పాల్, వరుణ్ సూద్ కీలకపాత్రల్లో కనిపించనున్నారు.

ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా రిలీజ్ డేట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. 2022 జూన్ 24న ‘జగ్ జగ్ జీయో’ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ మూవీకి జై పటేల్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Laal Singh Chaddha : బిగ్ పాన్ ఇండియా క్లాష్!