Vasudheva Sutham : వసుదేవ సుతం టీజర్ రిలీజ్.. ‘ధర్మ హింసా తథైవచ’.. అప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు హీరోగా..
తాజాగా వసుదేవ సుతం సినిమా తెలుగు టీజర్ ని రిలీజ్ చేశారు. (Vasudheva Sutham)

Vasudheva Sutham
Vasudheva Sutham : ‘దేవి’ సినిమా ఫేమ్ చైల్డ్ ఆర్టిస్ట్, సౌత్ లో అనేక సినిమాల్లో నటించిన మాస్టర్ మహేంద్రన్ ఇప్పుడు హీరోగా, నటుడిగా సినిమాలు చేస్తున్నాడు. మాస్టర్ మహేంద్రన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘వసుదేవ సుతం’. బేబీ చైత్ర శ్రీ, మాస్టర్ యువాంశ్ కృష్ణ బాదర్ల సమర్పణలో రెయిన్‌బో సినిమాస్ బ్యానర్‌పై ధనలక్ష్మి బాదర్ల నిర్మాణంలో వైకుంఠ్ బోను దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.(Vasudheva Sutham)
గతంలో వసుదేవ సుతం సినిమా గ్లింప్స్ రిలీజ్ చేయగా తాజాగా ఈ సినిమా తెలుగు టీజర్ ని రిలీజ్ చేశారు. హీరో సత్యదేవ్ చేతుల మీదుగా ఈ టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ చూస్తుంటే హీరో ధర్మం కోసం నిలబడే వ్యక్తిగా, అలాగే ఓ నిధి కోసం కొంతమంది ప్రయత్నించే కథాంశంతో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది.
Also Read : Dark Chocolate : ‘డార్క్ చాక్లెట్’ టీజర్ రిలీజ్.. బాబోయ్ మొత్తం బూతులేగా.. రానా సమర్పణలో..
మీరు కూడా వసుదేవ సుతం టీజర్ చూసేయండి..
వసుదేవ సుతం సినిమాని తెలుగు, తమిళ, హిందీ, ఒరియా భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అంబికావాణి, జాన్ విజయ్, మైమ్ గోపి, సురేష్‌చంద్ర మీనన్, ఐశ్వర్యలక్ష్మి, తులసి, రాజీవ్ కనకాల, టార్జన్, భధ్రమ్, జబర్దస్త్ రామ్ ప్రసాద్, శివన్నారాయణ, దువ్వాసి మోహన్.. పలువురు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Also Read : Raashii Khanna : పవన్ కళ్యాణ్ స్పీచ్ వస్తుందని షూటింగ్ ఆపేసిన డైరెక్టర్.. రాశీఖన్నా కామెంట్స్ వైరల్..