Raashii Khanna : పవన్ కళ్యాణ్ స్పీచ్ వస్తుందని షూటింగ్ ఆపేసిన డైరెక్టర్.. రాశీఖన్నా కామెంట్స్ వైరల్..
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడగా పవన్ కళ్యాణ్ ప్రస్తావన వచ్చింది. దీంతో రాశీఖన్నా ఓ ఆసక్తికర సంఘటన తెలిపింది. (Raashii Khanna)

Raashii Khanna
Raashii Khanna : పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులతో పాటు సినీ పరిశ్రమలో కూడా ఆయనకు చాలా మంది అభిమానులు ఉన్నారు. 2024 ఎన్నికల తర్వాత దేశవ్యాప్తంగా పవన్ క్రేజ్ మరింత పెరిగింది. ఆయన స్పీచ్ లకు కూడా అభిమానులు ఉన్నారు. హీరోయిన్ రాశీఖన్నా పవన్ కళ్యాణ్ సరసన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటిస్తుంది. దీంతో ఆమె ప్రతి ఇంటర్వ్యూలో పవన్ గురించి, ఆ సినిమా గురించి ప్రశ్నలు ఎదురవుతున్నాయి.(Raashii Khanna)
రాశీఖన్నా తెలుసు కదా సినిమాతో అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడగా పవన్ కళ్యాణ్ ప్రస్తావన వచ్చింది. దీంతో రాశీఖన్నా ఓ ఆసక్తికర సంఘటన తెలిపింది.
Also See : Vijay Deverakonda : విజయ్ దేవరకొండ కొత్త సినిమా ఓపెనింగ్.. ఫొటోలు..
రాశీఖన్నా మాట్లాడుతూ.. ఊహలు గుసగుసలాడే సినిమా షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ వస్తుంది. ఆ స్పీచ్ వినడానికి మా డైరెక్టర్ షూటింగ్ ఆపేసారు. నేను అదేంటి పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ కోసం షూటింగ్ ఆపేయడం ఏంటి అనుకున్నాను. అప్పుడు నాకు ఆయన క్రేజ్ గురించి, ఆయన ఆరా గురించి, ఆయన పవర్ ఫుల్ స్పీచ్ ల గురించి తెలిసింది. బాలీవుడ్ లో కూడా నేను ఆయన క్రేజ్ గురించి చెప్పాను. ఆయన ఆరా ఎవ్వరికి రాదు. నేను ఎప్పటికైనా షారుఖ్ ఖాన్ తో పనిచేయాలి అనుకునేదాన్ని. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారితో కూడా పనిచేయాలి అని డిసైడ్ అయ్యాను. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో ఆ ఛాన్స్ వచ్చింది. ఆయనతో షూటింగ్ చేసిన డేస్ మెమరబుల్. నాకు హరీష్ శంకర్ గారు ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ సినిమాలో అని అడిగితే స్టోరీ కూడా వినకుండా సినిమా ఓకే చేశాను. కేవలం పవన్ కళ్యాణ్ గారి సినిమా అనే ఓకే చేశాను అని తెలిపింది.
దీంతో రాశి చెప్పిన దాని ప్రకారం 2014 లో జనసేన ఆరంభంలో పవన్ పొలిటికల్ ఎంట్రీ సమయంలో ఓ మీటింగ్ లో ఇచ్చిన స్పీచ్ చూడటానికి ఊహలు గుసగుసలాడే డైరెక్టర్ అవసరాల శ్రీనివాస్ ఆ స్పీచ్ వినడానికి షూటింగ్ ఆపేసాడని తెలుస్తుంది.
View this post on Instagram
Also See : Nisha Aggarwal : కాజల్ చెల్లి, హీరోయిన్ నిషా అగర్వాల్ కర్వా చౌత్ సెలబ్రేషన్స్.. ఫొటోలు..