Dark Chocolate : ‘డార్క్ చాక్లెట్’ టీజర్ రిలీజ్.. బాబోయ్ మొత్తం బూతులేగా.. రానా సమర్పణలో..

తాజాగా డార్క్ చాక్లెట్ సినిమా టీజర్ రిలీజ్ చేశారు.(Dark Chocolate)

Dark Chocolate : ‘డార్క్ చాక్లెట్’ టీజర్ రిలీజ్.. బాబోయ్ మొత్తం బూతులేగా.. రానా సమర్పణలో..

Dark Chocolate

Updated On : October 11, 2025 / 4:11 PM IST

Dark Chocolate : విశ్వదేవ్ రాచకొండ, బిందు మాధవి, రమేష్, రాకేష్ .. పలువురు కీలక పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా డార్క్ చాక్లెట్. రానా దగ్గుబాటి సమర్పణలో వాల్తేర్ ప్రొడక్షన్స్, స్పిరిట్ మీడియా బ్యానర్స్ పై శశాంక్ శ్రీవాత్సవ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు.(Dark Chocolate)

ఈ టీజర్ అంతా విశ్వదేవ్ మెయిన్ పాత్రలో మిగతా వాళ్ళతో మాట్లాడుతూ డైలాగ్స్ ఉన్నాయి. ఇందులో ఎక్కువ బూతులు ఉండటం గమనార్హం. ఆ డైలాగ్స్ కూడా వేరే వేరే సీన్స్ ని పర్ఫెక్ట్ గా ఎడిటింగ్ లో కట్ చేసి సింక్ చేశారు. సెన్స్ లెస్ కామెడీ తరహాలో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. అలాగే రిలీజ్ డేట్ కి కూడా మూడు ఆప్షన్స్ ఇచ్చి ఒకటి ప్రేక్షకులని సెలెక్ట్ చేయమనడం గమనార్హం.

Also See : Raashii Khanna : పంజాబీ డ్రెస్ లో సింపుల్ లుక్స్ లో రాశీఖన్నా.. ఫొటోలు..

35 ఇది చిన్న కథ కాదు సినిమాలో చాలా పద్ధతైన పాత్రతలో అందర్నీ మెప్పించిన విశ్వదేవ్ ఈ సినిమాలో ఇలా బూతులతో డైలాగ్స్ చెప్పడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ టీజర్ ట్రెండింగ్ లో ఉంది. మీరు కూడా ఈ డార్క్ చాక్లెట్ టీజర్ చూసేయండి..

Also Read : Oka Manasu : 9 ఏళ్ళ తర్వాత ఓటీటీలోకి వచ్చిన మెగా డాటర్ మొదటి సినిమా.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే..