Oka Manasu : 9 ఏళ్ళ తర్వాత ఓటీటీలోకి వచ్చిన మెగా డాటర్ మొదటి సినిమా.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే..

నీ మీద ప్రేమ చావదు, ఇంకొకరి మీద ప్రేమ పుట్టదు.. అనే ఈ సినిమా డైలాగ్ అప్పట్లో బాగా వైరల్ అయింది. (Oka Manasu)

Oka Manasu : 9 ఏళ్ళ తర్వాత ఓటీటీలోకి వచ్చిన మెగా డాటర్ మొదటి సినిమా.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే..

Oka Manasu

Updated On : October 11, 2025 / 1:41 PM IST

Oka Manasu : మెగా టాటర్ నిహారిక కొణిదెల హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తూ తెరకెక్కిన సినిమా ‘ఒక మనసు’. నాగ శౌర్య, నిహారిక జంటగా మధుర ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై మధుర శ్రీధర్ రెడ్డి దర్శకత్వంలో రామరాజు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. అప్పట్లో ఈ సినిమా కమర్షియల్ గా పర్వాలేదనిపించినా ఎమోషనల్ గా ప్రేక్షకుల మనసులను హత్తుకుంది.(Oka Manasu)

నీ మీద ప్రేమ చావదు, ఇంకొకరి మీద ప్రేమ పుట్టదు.. అనే ఈ సినిమా డైలాగ్ అప్పట్లో బాగా వైరల్ అయింది. రాజకీయాల్లోకి రావాలనుకునే సూర్య పాత్రలో నాగశౌర్య, మెడిసిన్ చదివే స్టూడెంట్ సంధ్య పాత్రలో నిహారిక .. వీరిద్దరి మధ్య ప్రేమకథతో ఈ సినిమా సాగుతుంది. ఈ సినిమా సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఎమోషనల్ గా మెలోడీ గా ఉంటాయి.

Also Read : Raashii Khanna : పవన్ కళ్యాణ్ స్పీచ్ వస్తుందని షూటింగ్ ఆపేసిన డైరెక్టర్.. రాశీఖన్నా కామెంట్స్ వైరల్..

2016 జూన్ లో థియేటర్స్ లో రిలీజయిన ఈ సినిమా ఇన్నాళ్లకు ఓటీటీలోకి వచ్చింది. ఒక మనసు సినిమా ప్రస్తుతం ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అప్పట్లో మిస్ అయితే ఈ సినిమాని ఇప్పుడు ఓటీటీలో చూసేయండి. మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక ఈ సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఒక సున్నితమైన ప్రేమకథతో, మనసుకు హత్తుకునే ఎమోషన్స్ తో ఈ సినిమా సాగుతుంది.

Naga Shaurya Niharika Konidela Oka Manasu Movie Streaming in OTT after 9 Years from Release

Also See : Vijay Deverakonda : విజయ్ దేవరకొండ కొత్త సినిమా ఓపెనింగ్.. ఫొటోలు..