Laal Singh Chaddha : బిగ్ పాన్ ఇండియా క్లాష్!

‘కె.జి.యఫ్ 2’ రిలీజ్ రోజునే ఆమిర్ ఖాన్ - నాగ చైతన్యల ‘లాల్ సింగ్ చద్దా’..

Laal Singh Chaddha : బిగ్ పాన్ ఇండియా క్లాష్!

Laal Singh Chaddha

Updated On : November 20, 2021 / 1:54 PM IST

Laal Singh Chaddha: పాండమిక్ తర్వాత ఫిలిం ఇండస్ట్రీలో రిలీజ్ క్లాష్ తప్పడం లేదు. స్టార్ హీరోల సినిమాలు, అందులోనూ పాన్ ఇండియా సినిమాల పరిస్థితి మాత్రం టఫ్‌గా ఉంది. ఇప్పుడు మరో రెండు పాన్ ఇండియా సినిమాల మధ్య రిలీజ్ క్లాష్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.

Laal Singh Chaddha : నాగ చైతన్య క్యారెక్టర్ నేను చెయ్యాల్సింది..

ఆమిర్ ఖాన్, కరీనా కపూర్ ఖాన్ జంటగా నటిస్తున్న సినిమా ‘లాల్ సింగ్ చద్దా’.. ఆస్కార్ అవార్డ్ అందుకున్న హాలీవుడ్ మూవీ ‘ఫారెస్ట్ గంప్’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ‘సీక్రెట్ సూపర్ స్టార్’ ఫేమ్ అద్వైత్ చందన్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీతో టాలీవుడ్ యంగ్ హీరో, యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు.

Laal Singh Chaddha : ఆమిర్ ఖాన్‌తో ఫొటో కోసం ఎగబడ్డ వెంకటాపురం ప్రజలు..

ఈ క్రిస్మస్‌కి రిలీజ్ కావాల్సిన ‘లాల్ సింగ్ చద్దా’ మూవీని 2023 ఏప్రిల్ 14న రిలీజ్ చెయ్యబోతున్నట్లు శనివారం అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. కట్ చేస్తే ఇంతకుముందే ఈ డేట్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘కె.జి.యఫ్ 2’ కోసం ఫిక్స్ చేశారు. ఇప్పుడు అదే రోజు అమీర్ ఫిలిం రిలీజ్ అంటే.. బాక్సాఫీస్ క్లాష్ ఎలా ఉండబోతుందో చూడాలి మరి.

Jr NTR Family : ఫ్యామిలీతో స్విట్జర్లాండ్‌కి తారక్