Divvela Madhuri: బిగ్ బాస్ లోకి దివ్వెల మాధురి.. వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ..

ఈ కొత్త, పాత కంటెస్టెంట్ల మధ్య గట్టి పోటీ, కాంట్రవర్సీలు మొదలయ్యే అవకాశం ఉంది.

Divvela Madhuri: బిగ్ బాస్ లోకి దివ్వెల మాధురి.. వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ..

Updated On : October 11, 2025 / 11:01 PM IST

Divvela Madhuri: బిగ్ బాస్ తెలుగు 9 రియాలిటీ షో ఉత్కంఠగా సాగుతోంది. ఈ సీజన్ లో ట్విస్ట్ లు మామూలుగా లేవు. ఏ సమయంలో ఎలాంటి మలుపు తిరుగుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. కొత్త మలుపులు, నామినేషన్లు, ఎలిమినేషన్లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది సీజన్‌ 9. తాజాగా ఎంటర్‌టైన్‌మెంట్ డోస్‌ను మరింత పెంచేలా నిర్వాహాకులు ప్లాన్ చేశారు.

ఈసారి హౌస్ లోకి వైల్డ్ కార్డ్ తో ఏకంగా ఏడుగురు సభ్యులు అడుగుపెట్టనున్నారు. కొత్త సభ్యుల గ్రాండ్ ఎంట్రీ ఎపిసోడ్‌ను బిగ్ బాస్ 2.O గ్రాండ్ లాంచ్ పేరుతో ప్రసారం చేయనున్నారు. ఈ కొత్త ఎంట్రీలతో బిగ్ బాస్ 9కి కొత్త ఊపు రావడమే కాదు, ఇంట్లో అసలైన రణరంగం మొదలవడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకుంటే ఈ కొత్త, పాత కంటెస్టెంట్ల మధ్య గట్టి పోటీ, కాంట్రవర్సీలు మొదలయ్యే అవకాశం ఉంది.

కాగా.. వైల్డ్ కార్డ్ ఎంట్రీల ద్వారా బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టనున్న వారిలో మోస్ట్ కాంట్రవర్సీ అయిన వ్యక్తులు.. దివ్వెల మాధురి నుంచి చిట్టి అలేఖ్య పికిల్స్ రమ్య మోక్ష వరకు ఉన్నారు.

సోషల్ మీడియాలో సెన్సేషన్ దివ్వెల మాధురి బిగ్ బాస్ తెలుగు 9లోకి అడుగుపెడుతోంది. దువ్వాడ శ్రీనివాస్-దివ్వెల మాధురి జంట ఏపీలో తెగ వైరల్ అయింది. కాగా, బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభంలోనే వెళ్లాల్సిన దివ్వెల మాధురి ఇప్పుడు ఎంట్రీ ఇవ్వనుంది.

దివ్వెల మాధురి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద ఎత్తున కాంట్రవర్సీ అయిన సంగతి తెలిసిందే. ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియో పెద్ద రచ్చకు దారి తీసింది. ఆమె చేసే పోస్టులు అమాంతం వైరల్ అయ్యాయి. ఇలాంటి సెన్సేషనల్ ఇమేజ్ ఉన్న మాధురి హౌస్‌లోకి వస్తే డ్రామా పీక్స్‌కు వెళ్లడం ఖాయం అంటున్నారు అభిమానులు.

అటు, తెలుగు రాష్ట్రాల్లో వివాదాస్పదమైన అలేఖ్య చిట్టి పికిల్స్ నుంచి రమ్య మోక్ష కూడా బిగ్ బాస్ తెలుగు 9లో ఎంట్రీ ఇస్తోంది. ముగ్గురు అక్కా చెల్లెళ్లలో ఒకరైన రమ్య మోక్ష సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయింది. గ్లామర్ షో, అందంతో అట్రాక్ట్ చేసిన రమ్య మోక్ష బిగ్ బాస్ 9 తెలుగులో ఎలా అలరిస్తుందో చూడాలి.

Also Read: ప్రధాని మోదీని కలిసిన రాంచరణ్ దంపతులు.. ఎందుకంటే..