Theatrical Releases : ఈ వారం థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న సినిమాలు ఇవే..

ఈ వారం థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న సినిమాలు ఇవే..

June 1st week Theatrical Releases

Movies : ఒకప్పుడు సమ్మర్(Summer) అంటే పెద్ద హీరోల సినిమాలు సందడి చేసేవి. కానీ ఈ సమ్మర్ అంతా చిన్న, మీడియం హీరోలే సందడి చేస్తున్నారు. జూన్ మొదటి వారంలో కూడా తెలుగులో చిన్న సినిమాలే ఉన్నాయి.

ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ తనయుడు, రానా తమ్ముడు హీరోగా ఎంట్రీ ఇస్తున్న సినిమా ‘అహింస’. డైరెక్టర్ తేజ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. అహింస సినిమా జూన్ 2న థియేటర్స్ లో రిలీజ్ కానుంది.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేష్ హీరోగా తెరకెక్కుతున్న రెండో సినిమా ‘నేను స్టూడెంట్ సర్’. ఈ సినిమాతో ఒకప్పటి హీరోయిన్ భాగ్యశ్రీ కూతురు అవంతిక హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది. నాంది సతీష్ ఈ సినిమాను నిర్మించారు. నేను స్టూడెంట్ సర్ సినిమా కూడా జూన్ 2న థియేటర్స్ లో రిలీజ్ కానుంది.

ఇటీవల మసూద సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తిరువీర్ ముఖ్య పాత్రలో తెరకెక్కిన సినిమా ‘పరేషాన్’. ఈ సినిమా కూడా జూన్ 2న విడుదల అవుతుంది. ఈ సినిమాని రానా రిలీజ్ చేయడం విశేషం.

నటుడు అజయ్ ముఖ్యపాత్రలో ‘చక్రవ్యూహం’ అనే మరో చిన్న సినిమా కూడా జూన్ 2న రిలీజ్ కానుంది.

ఇక హాలీవుడ్ సినిమా ‘స్పైడర్ మ్యాన్: అక్రాస్ ది స్పైడర్ వెర్స్’ తెలుగు డబ్బింగ్ తో రిలీజ్ కానుంది.