Jyotika : హీరోయిన్ జ్యోతిక తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. ఠాగూర్, మాస్, షాక్.. లాంటి పలు సినిమాలతో తెలుగులో మెప్పించడమే కాక తమిళ్ డబ్బింగ్ సినిమాలతో కూడా అలరించింది. ఇక సూర్య భార్యగా మంచి రెస్పెక్ట్ కూడా అందుకుంటుంది. జ్యోతిక ముంబైలో పుట్టినా సౌత్ లో సినిమాలు చేసి, ఇక్కడ స్టార్ అయి ఇక్కడే సెటిల్ అయిపోయింది.(Jyotika)
జ్యోతిక ఇప్పుడు కూడా పలు సినిమాలు చేస్తుంది. తాజాగా బాలీవుడ్ లో ఓ సినిమా చేయగా ఈ సినిమా ప్రమోషన్స్ లో జ్యోతిక ముంబైలో మాట్లాడుతూ.. నేను సౌత్ లో చాలా మంది స్టార్స్ తో కలిసి నటించాను. కానీ అక్కడ మహిళలకు ఇంపార్టెన్స్ ఇవ్వరు. కనీసం పోస్టర్స్ మీద కూడా మా ఫోటోలు ఉండవు. అజయ్ దేవగన్, మమ్ముట్టి లాంటి వాళ్ళు మహిళలకు ప్రాముఖ్యత ఇస్తారు అని తెలిపింది.
Also Read : Constable : వరుణ్ సందేశ్ ‘కానిస్టేబుల్’ ట్రైలర్ చూశారా?
దీంతో జ్యోతిక కామెంట్స్ వైరల్ అవ్వగా సౌత్ సినిమా ప్రేక్షకులు, సూర్య ఫ్యాన్స్ కూడా ఆమెని ట్రోల్ చేస్తున్నారు. ఆమె పోస్టర్స్ ఉన్న ఫోటోలు షేర్ చేసి ఇవి సౌత్ సినిమాలు కావా అని ప్రశ్నిస్తున్నారు. సూర్య వైఫ్ అని సైలెంట్ గా ఉంటున్నాం అని పలువురు సూర్య ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మమ్ముట్టి సర్ సౌత్ అని మరిచిపోయారా, సౌత్ లో స్టార్ గా ఎదిగి బాలీవుడ్ కి వెళ్లి అక్కడ సౌత్ సినిమాలను విమర్శించడం ఏంటి అని నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. మరి దీనిపై జ్యోతిక స్పందిస్తుందో లేదో చూడాలి.
Also See : Madharaasi Pre Release Event : శివ కార్తికేయన్ ‘మదరాసి’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఫొటోలు..