Constable : వరుణ్ సందేశ్ ‘కానిస్టేబుల్’ ట్రైలర్ చూశారా?
తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కి రాజేంద్ర ప్రసాద్ గెస్ట్ గా హాజరయ్యారు.(Constable)

Constable
Constable : జాగృతి మూవీ మేకర్స్ బ్యానర్ పై బలగం జగదీష్ నిర్మాణంలో వరుణ్ సందేశ్, మధులిక వారణాసి జంటగా ఆర్యన్ సుభాన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘కానిస్టేబుల్’. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కి రాజేంద్ర ప్రసాద్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ ఈవెంట్లో ముగ్గురు కానిస్టేబుల్స్ ని సత్కరించారు.(Constable)
మీరు కూడా కానిస్టేబుల్ ట్రైలర్ చూసేయండి..
ఈ ఈవెంట్లో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. గతంలో నేను కూడా పోలీస్ పాత్రలు చేశాను. కానీ ఆ పాత్రలు కామెడీ ప్రధానంగా సీరియస్ నెస్ తో సాగేవి. కానీ ఈ సినిమా కంటెంట్ నేటి ట్రెండ్ కు తగ్గట్టుగా ఉంది. వరుణ్ సందేశ్ తన పాత్రలో ఒదిగిపోయాడు అని అన్నారు. మరో గెస్ట్ లు తెలంగాణ కల్చరల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, నటుడు శివారెడ్డిలు మాట్లాడుతూ.. కంటెంట్ ఉన్న సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. పోలీస్ వాళ్ళు మన భద్రతకు అహర్నిశలు ఎంత శ్రమ పడుతున్నారో మనకు తెలిసిందే. వాళ్ళ కథను సెలెక్ట్ చేసుకొని తీసిన ఈ సినిమా మంచి విజయం సాధించాలి అని అన్నారు.
Also See : Rukmini Vasanth : ‘మదరాసి’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో.. రుక్మిణి వసంత్ మెరుపులు.. ఫొటోలు..
హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ.. నాకు ఇప్పటి వరకు లవర్ బాయ్ గా పేరు ఉంది. అయినా విభిన్న పాత్రలను సెలెక్ట్ చేసుకొని నటించడాని ట్రై చేస్తున్నాను. డైరెక్టర్ ఈ కథ నాకు చెప్పినప్పుడు కానిస్టేబుల్ క్యారెక్టర్ ను ఊహించుకొని చెయ్యగలననే నమ్మకం ఏర్పడిన తర్వాతే ఈ సినిమా చెయ్యడం జరిగింది అని అన్నారు. నిర్మాత బలగం జగదీశ్ మాట్లాడుతూ.. ఈ కథకు ఏడు నుండి 8 మంది హీరోలను ఆలోచించాము. వరుణ్ సందేశ్ అయితే బాగుంటుందని ఆయన్ని సంప్రదించాము. ఒక వ్యక్తి కి అవమానం జరిగినప్పుడు దాని ప్రభావం ఎలా ఉంటుందో అనే అంశానికి సందేశాన్ని జోడించి ఈ సినిమా చేశాము అని అన్నారు.
డైరెక్టర్ ఆర్యన్ సుభాన్ మాట్లాడుతూ.. ఈ సినిమా మా అందరి కెరీర్ ను మలుపు తిప్పుతుంది. ఆణి ముత్యాల్లాంటి నాలుగు పాటలు ఈ సినిమాలో ఉన్నాయి. కానిస్టేబుల్ కు సంబంధించిన పాటను గద్దర్ నర్సన్న అద్భుతంగా పాడారు. పోలీస్ కుటుంబాలు అందరూ చూసినా మా సినిమాకు బాగా డబ్బులు వస్తాయి అని అన్నారు.
Also See : Madharaasi Pre Release Event : శివ కార్తికేయన్ ‘మదరాసి’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఫొటోలు..
సిటీ కమిషనర్ సివి ఆనంద్ హాజరవ్వాల్సి ఉండగా ఆయన రాకపోవడంతో.. ఈ ఈవెంట్ కి నేను రావాల్సి ఉంది. కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోతున్నాను. మా అకానిస్టేబుల్స్ మీద సినిమా చేసి, కానిస్టేబుల్ అనే టైటిల్ పెట్టడం మాకు సంతోషకరం అని అన్నారు.