K Viswanath says Sirivennella movie made me very emotional
K Viswanath : భారతీయ సినీపరిశ్రమలో టాలీవుడ్ పేరు వినబడేలా చేసిన దర్శకుల్లో కె విశ్వనాథ్ ఒకరు. భారతీయ సంస్కృతికి చిహ్నమైన శాస్త్రీయ కళలను తన కథలుగా మలుచుకొని, అద్భుతమైన చిత్ర కావ్యాలను తెరకెక్కించి కళాతపస్వి అనిపించుకున్నారు దర్శకుడు విశ్వనాథ్. ఇక అయన తెరకెక్కించిన శంకరాభరణం సినిమా జాతీయ పురస్కారాన్ని అందుకొని తెలుగుతెరపై ఒక మైలురాయిగా నిలిచింది.
K Viswanath : మీ దర్శకత్వంలో నటించడం నా అదృష్టం.. కళాతపస్వికి మెగాస్టార్ జన్మదిన శుభాకాంక్షలు
ఇలా ఒకటి ఏంటి.. స్వాతిముత్యం, సాగరసంగమం, స్వయంకృషి, స్వర్ణకమలం, సిరివెన్నెల ప్రతి చిత్రం తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిని. ఇంతటి గొప్ప చిత్రాలు అందించినందుకు భారతీయ ప్రభుత్వం కూడా ఆయన్ని పద్మశ్రీ, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులతో సత్కరించింది. కాగా తన సినిమాలతో ప్రేక్షకుల మనసుని తేలికచేసే విశ్వనాథ్ మనసుని మాత్రం ఒక సినిమా చిత్రవధ చేసిందట. అదే ‘సిరివెన్నెల’ సినిమా.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో విశ్వనాథ్‌ని బాగా తృప్తి పరిచిన సినిమా ఏదని ప్రశ్నించగా, విశ్వనాథ్ బదులిస్తూ.. “కళాకారుడు అనేవాడు జీవితాంతం తృప్తి పొందాడు. ఇంకా ఏదో చేయాలి, సాధించాలనే అసంతృప్తితోనే బ్రతుకుతాడు. నేను అంతే, కానీ నన్ను మానసికంగా చాలా బాధపెట్టిన సినిమా మాత్రం ‘సిరివెన్నెల’. అసలు ఒక మాటలు రాని అమ్మాయి ఏంటి, కళ్ళు కనబడని అబ్బాయి ఏంటి, వారిద్దరి మధ్య సన్నివేశాలు క్రియేట్ చేయడానికి నేను రాత్రి పగలు కష్టపడడం ఎందుకు. ఆ కథ ఎందుకు మొదలు పెట్టానో అని ఎంతో బాధ పడ్డా. చిత్రీకరణ మధ్యలో ఉన్నప్పుడు అటు ముగించలేను, ఇటు సినిమాని ఆపేయలేను. ఆ సమయంలో చిత్రవధ అనుభవించా” అంటూ తెలియజేశారు. కట్ చేస్తే సిరివెన్నెల సినిమా తెలుగుతెరపై ఒక క్లాసిక్‌గా నిలిచిపోయింది.