Kaikala – Chalapathi : మరణించిన కైకాల, చలపతి.. కృష్ణాజిల్లా వాసులే..

టాలీవుడ్ ఇండస్ట్రీ రెండురోజుల్లో ఇద్దరి మహానటులను కోలుపోయింది. ఈ శుక్రవారం ఉదయం కైకాల సత్యనారాయణ కోలుపోయిన సినీపరిశ్రమ, అది జీర్ణించుకోక ముందే ఈరోజు తెల్లవారుజామున చలపతి రావు మరణవార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. కాగావీరిద్దరూ..

Kaikala and Chalapathi were krishna district people

Kaikala – Chalapathi : టాలీవుడ్ ఇండస్ట్రీ రెండురోజుల్లో ఇద్దరి మహానటులను కోలుపోయింది. ఈ శుక్రవారం ఉదయం కైకాల సత్యనారాయణ కోలుపోయిన సినీపరిశ్రమ, అది జీర్ణించుకోక ముందే ఈరోజు తెల్లవారుజామున చలపతి రావు మరణవార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇటీవలే టాలీవుడ్ సీనియర్ హీరోలు కృష్ణంరాజు, కృష్ణ మరణించిన సంగతి కూడా తెలిసిందే. దీంతో వరుస మరణాలతో తెలుగు సినీపరిశ్రమ శోకసంద్రంలో మునిగితేలుతోంది.

Chalapathi Rao : నటుడు చలపతి రావు కన్నుమూత..

కాగా తన నటనతో నవరస నటనా సార్వభౌమగా పేరుని సంపాదించుకున్న నటుడు కైకాల సత్యనారాయణ.. 1935 జులై 25న ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం కవుతరంలో జన్మించారు. అక్కడి నుంచి సినీ పరిశ్రమకి వచ్చిన కైకాల, నటుడిగా 750 పైగా సినిమాల్లో నటించి అలరించారు. 1996లో మచిలీపట్నం నుంచి తెలుగుదేశం పార్టీ తరుపున ఎంపీ లోక్ సభకి కూడా ఎన్నికయ్యారు.

ఇక నటుడు చలపతి కూడా తెలుగుతెరపై విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనదైన ముద్ర వేశారు. ఈయన కూడా కృష్ణాజిల్లాలోని పెడన మండలం బల్లిపర్రులో 1944 మే 8న జన్మించారు. నటుడిగా 1200 పైగా సినిమాల్లో నటించిన చలపతి రావు పలు సినిమాలు కూడా నిర్మించారు. అయన కుమారుడు రవిబాబు కూడా సినిమారంగంలో దర్శకుడిగా, నటుడిగా పని చేస్తున్నారు. కాగా కైకాల, చలపతి గ్రామాల మధ్య దూరం కేవలం 15KM. పరిశ్రమ నుంచి ఇద్దరు సీనియర్ నటులు రెండురోజులు వ్యవధిలో చనిపోవడమే కాకుండా వారిద్దరూ ఒకే జిల్లాకి సంబంధించిన వారై ఉండడం విశేషం.