Kaikala Satyanarayana : కోరిక నెరవేరకుండానే కన్నుమూసిన కైకాల..

టాలీవుడ్ సీనియర్ నటుడు 'కైకాల సత్యనారాయణ' 87 ఏళ్ళ వయసులో కన్నుమూశారు. అయన అకాల మరణంతో టాలీవుడ్ పరిశ్రమ మొత్తం శోక సంద్రంలో మునిగిపోయింది. కాగా కైకాల సత్యనారాయణ, తన కోరిక నెరవేరకుండానే కన్నుమూశారు.

Kaikala Satyanarayana passed away without fulfilling his wish

Kaikala Satyanarayana : టాలీవుడ్ సీనియర్ నటుడు ‘కైకాల సత్యనారాయణ’ 87 ఏళ్ళ వయసులో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కైకాల.. అయన ఇంటి వద్దే చికిత్స తీసుకుంటున్నారు. ఈ శుక్రవారం తీవ్ర అస్వస్థకు గురైన సత్యనారాయణ తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. అయన అకాల మరణంతో టాలీవుడ్ పరిశ్రమ మొత్తం శోక సంద్రంలో మునిగిపోయింది.

Kaikala Satyanarayana : అధికార లాంఛనాలతో కైకాల అంతక్రియలు..

కాగా కైకాల సత్యనారాయణ, తన కోరిక నెరవేరకుండానే కన్నుమూశారు. అనుష్క నటించిన అరుంధతి సినిమాలో కైకాల నటించిన విషయం తెలిసిందే. ఆ మూవీ విడుదల సమయంలో కైకాల తన మనసులోని కోరికను బయటపెట్టారు. “ఇప్పటి వరకు 870 సినిమాలు చేశాను. 1000 సినిమాలు చేయకపోయినా కనీసం 900 సినిమాలైనా పూర్తి చేయాలని అనుకుంటున్నా” అని చెప్పుకొచ్చారు.

అయితే అనారోగ్య సమస్యలు వల్ల కొంతకాలంగా ఇంటికే పరిమితమైన కైకాలకి అది తీరని కోరికలా మిగిలిపోయింది. ఇక కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు.. ఇవాళ ప్రభుత్వ లాంఛనాల మధ్య జూబ్లీ హిల్స్‌లోని మహాప్రస్థానంలో జరగనున్నాయి. ప్రస్తుతం అభిమానుల సందర్శనార్ధం కోసం కైకాల భౌతికకాయాన్ని ఫిల్మ్ ఛాంబర్ కి తరలించారు. 11:30 గంటలకు అంతిమయాత్ర మొదలుకానుంది.