హనీమూన్‌లో కాజల్.. సముద్రపు ఒడ్డున అందంగా!

  • Publish Date - November 9, 2020 / 08:05 AM IST

ప్రముఖ నటి కాజల్ అగర్వాల్(Kajal Aggarwal) తన చిరకాల ప్రియుడు గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకుని ప్రస్తుతం తన వెడ్డింగ్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తుంది. ప్రస్తుతం మాల్దీవుల్లో తన హనీమూన్‌లో ఉంది కాజల్. కాజల్.. తన హనీమూన్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఇందులో ఆమె గౌతమ్‌తో కలిసి సముద్రపు ఒడ్డున ఎరుపు రంగు దుస్తులు ధరించి ఉంది.

భర్తతో కలిసి హనీమూన్‌ను ఎంజాయ్ చేస్తున్న కాజల్ అగర్వాల్.. మాల్దీవుల్లోని ప్రకృతి సౌందర్యం మధ్య పరవశంలో మునిగితేలుతుంది.


https://10tv.in/friends-for-7-years-dated-for-3-the-kajal-aggarwal-and-gautam-kitchlu-love-story/
ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును మూడేళ్ల రిలేషన్‌షిప్‌ తర్వాత కాజల్ పెళ్లి చేసుకున్నారు. అక్టోబర్ 30వ తేదీన వీరిద్దరు ఒక్కటయ్యారు. ముంబైలోని తాజ్ మహల్ ప్యాలెస్‌లో పెళ్లి జరగగా.. భర్తతో కలిసి కర్వా చౌత్ జరుపుకున్నారు.


కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లు మాల్దీవుల్లో హనీమూన్‌ను ఎంజాయ్ చేస్తోన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫొటోలను కాజల్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

సముద్రం ఒడ్డున నిలబడి కాజల్ తీసుకున్న ఈ ఫొటోలు చాలా అందంగా ఉండగా.. మాల్దీవులు ప్రకృతి అందాలు మధ్య మెరుపులా కనిపిస్తుంది.


కొన్‌రాడ్ మాల్దీవ్స్ రంగలి ఐల్యాండ్‌లో ఉన్న లగ్జరీ రిసార్ట్స్‌లో ప్రస్తుతం కాజల్, గౌతమ్ కిచ్లు ఉన్నారు. మరికొద్ది రోజులు వీరు అక్కడే ఉంటారు. ప్రస్తుతం కాజల్.. చిరంజీవి హీరోగా ఆచార్య సినిమాతో పాటు ‘మోసగాళ్ళు’, ‘ఇండియన్ 2’, ‘ముంబై సాగ’ సినిమాల్లో నటిస్తున్నారు.