Kajal Aggarwal Busy with Movies in Second Innings
Kajal Aggarwal : టాలీవుడ్(Tollywood) చందమామ.. కాజల్ అగర్వాల్. లక్ష్మి కళ్యాణం సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమైన కాజల్ అతి తక్కువ సమయంలోనే తెలుగు, తమిళ్ స్టార్ హీరోలందరితో నటించి సౌత్ లో స్టార్ హీరోయిన్ అయిపొయింది. ఆల్రెడీ 50 సినిమాలు కూడా చేసేసింది హీరోయిన్ గా. కరోనా సమయంలో అందర్నీ ఆశ్చర్యపరుస్తూ సడెన్ గా పెళ్లి చేసుకొని సినిమాలకు గ్యాప్ ఇచ్చింది.
పెళ్లి, ఆ తర్వాత బాబు.. ఇలా కొన్నాళ్ళు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది కాజల్. ఇటీవలే మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. కాజల్ కి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. కాజల్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టగానే ఆమెతో సినిమాలు తీయడానికి రెడీ అవుతున్నారు. తాజాగా బాలకృష్ణ(Balakrishna) సరసన భగవంత్ కేసరి(Bhagavanth Kesari) సినిమాతో తెలుగులో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చింది కాజల్.
భగవంత్ కేసరి సినిమా హిట్ టాక్ వస్తుండటంతో దీని తర్వాత మరిన్ని ఆఫర్స్ రావడం ఖాయం అంటున్నారు అంతా. అయితే ఇప్పటికే కాజల్ ఇండియన్ 2 సినిమా షూటింగ్ పూర్తి చేసింది. అలాగే తెలుగు, తమిళ్ బైలింగ్వల్ సత్యభామ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాతో పాటు మరో రెండు తెలుగు సినిమాలు కాజల్ చేతిలో ఉన్నాయట. అంతే కాకుండా తెలుగు, తమిళ్ నుంచి కథలు చెప్పడానికి తనని మరింతమంది అప్రోచ్ అవుతున్నారని తెలిపింది. దీంతో ఇప్పటికే చేతిలో నాలుగు సినిమాలు ఉండగా మరిన్ని ఓకే చెప్పడానికి రెడీ అయింది కాజల్. మొత్తానికి సెకండ్ హాఫ్ లో కాజల్ అగర్వాల్ దూసుకుపోతుండటంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.