Kajal Aggarwal: ఇండియన్-2 కోసం కత్తి పట్టిన కాజల్ అగర్వాల్..

ఏస్ డైరెక్టర్ శంకర్ తన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఇండియన్ 2 షూటింగ్‌ని రెండున్నరేళ్ల విరామం తర్వాత ఆగస్టులో తిరిగి ప్రారంభించిన విషయం తెలిసిందే. రెండున్నరేళ్ల గ్యాప్ తరువాత కమల్ హాసన్ ఈరోజు నుంచి మళ్లీ ఇండియన్ 2 షూటింగ్‌ లో పాల్గొనున్నాడు. ఇదిలా ఉంటే, ఈ చిత్రంలో కథానాయిక నటిస్తున్న కాజల్ అగర్వాల్..

Kajal Aggarwal: ఇండియన్-2 కోసం కత్తి పట్టిన కాజల్ అగర్వాల్..

Kajal Aggarwal martial arts Practice

Updated On : September 26, 2022 / 9:47 PM IST

Kajal Aggarwal: ఏస్ డైరెక్టర్ శంకర్ తన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఇండియన్ 2 షూటింగ్‌ని రెండున్నరేళ్ల విరామం తర్వాత ఆగస్టులో తిరిగి ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇటీవల సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్‌లపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను రూపొందించిన శంకర్.. ఈ చిత్రం యొక్క తాజా షెడ్యూల్ ఈరోజు తిరుపతిలో ప్రారంభమైంది.

Ram Charan Shankar Movie: చరణ్ సినిమాలో మరో స్టార్ యాక్టర్.. ఎవరంటే?

రెండున్నరేళ్ల గ్యాప్ తరువాత కమల్ హాసన్ ఈరోజు నుంచి మళ్లీ ఇండియన్ 2 షూటింగ్‌ లో పాల్గొనున్నాడు. ఇదిలా ఉంటే, ఈ చిత్రంలో కథానాయిక నటిస్తున్న కాజల్ అగర్వాల్ తన పాత్ర కోసం కేరళ ప్రాచీన ఆత్మరక్షణ కళ అయిన.. “కళరిపయట్టు”ను ప్రాక్టీస్ చేస్తుంది. అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.

“నిన్నటి వరకు మాతృమూర్తిలా కనిపించిన కాజల్, ఇవాళ కత్తి పట్టి పోరాట యోధురాలిలా మారిపోయింది. వాట్ ఏ డెడికేషన్ కాజల్ అగర్వాల్” అంటూ ప్రశంసిస్తున్నారు నెటిజెన్లు. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని ఈ ఏడాది చివరి నాటికి షూటింగ్ పార్ట్‌ను ముగించి 2023 వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు మూవీ మేకర్స్.