Kajal Aggarwal Next Movie Ready To Release But Poor Promotions
Kajal Aggarwal: అందాల భామ కాజల్ అగర్వాల్ తన పెళ్లి, ఓ బిడ్డకు జన్మనివ్వడం తరువాత కూడా సినిమాల్లో నటిస్తూ దూసుకెళ్తోంది. ఇప్పటికే పలు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుల్లో ఈ చందమామ నటిస్తూ బిజీగా ఉంది. ఇటీవల ఆమె లీడ్ రోల్‌లో నటించిన ఘోస్టీ మూవీ తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మాత్రం అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది.
ఇక ఆ సినిమా రిజల్ట్ నుండి తేరుకున్న ఈ బ్యూటీ, ఇప్పుడు మరో సినిమాను రిలీజ్‌కు రెడీ చేసింది. ‘కరుంగాప్పియన్’ అనే టైటిల్‌తో తెరకెక్కిన ఈ సినిమాను ఏప్రిల్ 7న రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ సినిమా కథలో కాజల్ తొలిసారి తల్లి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా కథ స్వాతంత్ర్యానికి ముందు జరిగే కథగా ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేయనున్నట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
Kajal Aggarwal: ఉగాది కానుకగా కాజల్ కొత్త మూవీ.. భయపెడుతుందా?
అయితే, ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి ప్రమోషన్స్‌ను చిత్ర యూనిట్ చేయడం లేదు. అప్పుడెప్పుడో 2021లో ఈ చిత్ర ట్రైలర్‌ను విలక్షణ నటుడు విజయ్ సేతుపతి లాంచ్ చేయగా, ఆ తరువాత ఇప్పటివరకు ఎలాంటి ప్రమోషన్స్ లేకపోవడం విశేషం. ఇక ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, రెజీనా కసాండ్రా, జననీ అయ్యర్, రైజా విల్సన్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, ఈ సినిమాను డి.కార్తికేయన్ డైరెక్ట్ చేస్తున్నారు. మరి ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా రాబోతున్న ఈ సినిమా ఏప్రిల్ 7న ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటుందా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.