Kajal Aggarwal : సౌత్ సినిమాలపై కాజల్ ప్రశంసలు.. కాజల్ ని పొగుడుతూ రష్మికని ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..
తాజాగా కాజల్ అగర్వాల్ ఓ నేషనల్ మీడియాతో మాట్లాడుతూ సౌత్ వర్సెస్ బాలీవుడ్ అంశంపై స్పందించింది. కాజల్ అగర్వాల్ నార్త్ అమ్మాయే. కానీ సౌత్ లోనే ఎక్కువ క్లిక్ అయింది. కాజల్ మాట్లాడుతూ..................

Netizens Trolled Rashmika While comparing with Kajal Aggarwal
Kajal Aggarwal : : సౌత్(South) వర్సెస్ బాలీవుడ్(Bollywood) అని గత కొన్నాళ్ళుగా సాగుతూనే ఉంది. దీనిపై ఒక్కొక్కరు ఒక్కో రకంగా స్పందిస్తున్నారు. ఇటివల సౌత్ ఫుల్ సక్సెస్ మోడ్ లో ఉండటంతో సౌత్ సినిమాలని అభినందిస్తున్నారు అందరూ. కొన్ని రోజుల క్రితం బాలీవుడ్ లో రష్మిక(Rashmika) సౌత్ సినిమాలపై వ్యాఖ్యలు చేస్తూ.. అక్కడ మంచి లవ్ సాంగ్స్ ఉండవు, అన్ని మాస్ మసాలాలే అంటూ కామెంట్స్ చేయడంతో సౌత్ వాళ్లంతా నువ్వు సౌత్ అమ్మాయివి అయి ఉండి, సౌత్ లో పేరు తెచ్చుకొని ఇలా అంటావా, బాలీవుడ్ కంటే సౌత్ లోనే ఎక్కువ లవ్, మెలోడీ సాంగ్స్ ఉన్నాయంటూ నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేశారు.
తాజాగా కాజల్ అగర్వాల్ ఓ నేషనల్ మీడియాతో మాట్లాడుతూ సౌత్ వర్సెస్ బాలీవుడ్ అంశంపై స్పందించింది. కాజల్ అగర్వాల్ నార్త్ అమ్మాయే. కానీ సౌత్ లోనే ఎక్కువ క్లిక్ అయింది. కాజల్ మాట్లాడుతూ..నేను ముంబై అమ్మాయిని. పుట్టింది, పెరిగింది ఇక్కడే. బాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసినా నాకు పేరొచ్చింది మాత్రం సౌత్ లోనే. హైదరాబాద్, చెన్నై నాకు ఇప్పటికి హోమ్ ప్లేస్ లాంటివే. అది ఎప్పటికి మారదు. సౌత్ లో అనేక మంచి సినిమాలు వస్తున్నాయి. అక్కడ కూడా అద్భుతమైన దర్శకులు, టెక్నీషియన్లు ఉన్నారు.
నా మాతృభాష హిందీనే. బాలీవుడ్ సినిమాలు చూస్తూనే పెరిగాను. కానీ దక్షిణాదిలో ఓ మంచి స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది. సౌత్ లో ఉన్న నైతికత, విలువలు, క్రమశిక్షణ బాలీవుడ్ లో ఇప్పుడు లేవు అని నేను భావిస్తున్నాను అని కామెంట్స్ చేసింది. దీంతో కాజల్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. కాజల్ చేసిన వ్యాఖ్యలపై పలువురు బాలీవుడ్ నెటిజన్లు ట్రోల్ చేస్తే సౌత్ లో మాత్రం అభినందిస్తున్నారు.
VC Sajjanar : దయచేసి అలాంటి వాటికి ప్రమోషన్స్ చేయకండి.. అమితాబ్ కి సజ్జనార్ రిక్వెస్ట్..
అయితే గతంలో రష్మిక సౌత్ అమ్మాయి అయినా నార్త్ ని పొగిడి, సౌత్ సినిమాలని తక్కువ చేసి మాట్లాడింది. ఇప్పుడు కాజల్ నార్త్ అమ్మాయి అయినా తనకి సౌత్ లోనే పేరొచ్చిందని సౌత్ సినీ పరిశ్రమలని అభినందించింది. దీంతో నెటిజన్లు మరోసారి రష్మికని కాజల్ తో పోలుస్తూ ట్రోల్ చేస్తున్నారు. మీమర్స్ కూడా రష్మికని ఈ విషయంలో ట్రోల్ చేస్తూ కాజల్ ని అభినందిస్తున్నారు. దీంతో రష్మిక, కాజల్ ఇద్దరూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నారు.