Kajal Aggarawal : మన హీరోయిన్స్ సినిమాలతో పాటు షాప్ ఓపెనింగ్స్, యాడ్స్ కూడా చేస్తూ బిజీగా ఉంటారని తెలిసిందే. తాజాగా కాజల్ అగర్వాల్ ఓ షాప్ ఓపెనింగ్ లో పాల్గొంది. కరోనా సమయంలో పెళ్లి, ఆ తర్వాత బాబుని కని ఫ్యామిలీతో గడుపుతునే ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తుంది కాజల్. సినిమాలతో పాటు యాడ్స్, షాప్ ఓపెనింగ్స్ కూడా చేస్తుంది.
Also Read : Pawan Kalyan : OG అని అరిచే బదులు భగవత్ నామం జపించండి.. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు…
ఇప్పుడు ఏకంగా కాజల్ అగర్వాల్ దుబాయ్ లో ఓ జ్యువెల్లరీ షాప్ ఓపెనింగ్ చేసింది. లగ్జరీ జ్యువెల్లర్ అందించే కైరా జ్యువెల్లర్స్ తాజాగా దుబాయ్ లో తమ బ్రాంచ్ ని ప్రారంభించింది. దుబాయ్ లో ప్రారంభించిన లగ్జరీ జ్యువెల్లర్ షాప్ కైరా జ్యువెల్లర్స్ ఓపెనింగ్ కార్యక్రమంలో కాజల్ అగర్వాల్ పాల్గొంది.
అనంతరం కాజల్ అక్కడి ఇండియన్స్ తో మాట్లాడింది. కాజల్ వచ్చిందని తెలియడంతో దుబాయ్ లో కూడా ఇండియన్స్ పలువురు ఆ షాప్ ఓపెనింగ్ కి వచ్చి సందడి చేసారు.