Pawan Kalyan : OG అని అరిచే బదులు భగవత్ నామం జపించండి.. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు…
కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతుండగా ఫ్యాన్స్ OG.. OG.. అని అరిచారు.

Pawan Kalyan
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ ఉపముఖ్యమంత్రిగా ప్రభుత్వంలో బిజీగా ఉన్నారు. మరో పక్క సినిమాలు కూడా చేస్తున్నారు. చేతిలో ఉన్న సినిమాలు పూర్తిచేయాలని పవన్ హరిహర వీరమల్లు, OG సినిమాల షూటింగ్స్ కు డేట్స్ ఇస్తున్నారు. ఫ్యాన్స్ ఈ సినిమాల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. పవన్ పూర్తిగా రాజకీయాల్లోకి రావడంతో ఏదైనా బహిరంగ సభలో మాట్లాడటానికి వస్తే ఫ్యాన్స్ పవన్ సినిమాల గురించి అరుస్తున్నారు.
నేడు పవన్ కళ్యాణ్ ద్వారక తిరుమల మండలంలో ఉచిత గ్యాస్ పథకంలో భాగంగా దీపం-2 కార్యక్రమంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతుండగా ఫ్యాన్స్ OG.. OG.. అని అరిచారు.
Also Read : Kubera : నాగార్జున – ధనుష్ సినిమా ‘కుబేర’ టీజర్ ఎప్పుడో తెలుసా? కొత్త పోస్టర్ రిలీజ్..
దీంతో పవన్ కళ్యాణ్.. మీరు ఇలా సినిమాలు కాకుండా భగవత్ నామం జపిస్తే అద్భుతాలు జరుగుతాయి. సినిమాలు, సరదాలు ఉండాలి. ఉత్సాహం మంచిదే కానీ సినిమాలు చూడాలంటే ముందు మన దగ్గర డబ్బులు ఉండాలి, కడుపు నిండాలి కదా అని అన్నారు. దీంతో పవన్ వ్యాఖ్యలు వైరల్ అవ్వగా ఆ రెండు సినిమాలు పూర్తయితే పవన్ పూర్తిగా సినిమాలు వదిలేస్తారని ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.
మీరు [Fans] OG.. OG… అని సినిమా పేరు కన్నా….
భగవత్ నామం కానీ జపిస్తే ఎన్నో అద్భుతాలు జరుగుతాయి…– Deputy CM #PawanKalyan. pic.twitter.com/7sOi72s3iQ
— Gulte (@GulteOfficial) November 1, 2024