Kubera : నాగార్జున – ధనుష్ సినిమా ‘కుబేర’ టీజర్ ఎప్పుడో తెలుసా? కొత్త పోస్టర్ రిలీజ్..

తాజాగా కుబేర సినిమా నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేసి టీజర్ డేట్ కూడా ప్రకటించారు.

Kubera : నాగార్జున – ధనుష్ సినిమా ‘కుబేర’ టీజర్ ఎప్పుడో తెలుసా? కొత్త పోస్టర్ రిలీజ్..

Nagarjuna Dhanush Rashmika Kubera Movie Teaser Release Date Announced

Updated On : November 1, 2024 / 4:44 PM IST

Kubera : నాగార్జున – ధనుష్ మల్టీస్టారర్ గా రష్మిక మందన్న ముఖ్య పాత్రలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కుబేర. ఇప్పటికే ఈ సినిమా నుంచి నాగ్, ధనుష్, రష్మిక పోస్టర్స్ రిలీజ్ చేసారు. రష్మిక క్యారెక్టర్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేసారు. తమిళ్ – తెలుగు స్టార్స్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. శేఖర్ కమ్ముల కూడా క్లాసిక్, లవ్ స్టోరీ కాకుండా ఢిఫెరెంట్ గా ట్రై చేస్తుండటంతో ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

Also Read : Gautam – Sitara : న్యూయార్క్ రోడ్ల మీద తిరుగుతున్న గౌతమ్.. అక్కడ మా అన్న ఏం చేస్తున్నాడు అంటూ ప్రశ్నించిన సితార..

తాజాగా కుబేర సినిమా నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేసి టీజర్ డేట్ కూడా ప్రకటించారు. కుబేర సినిమా నుంచి నాగార్జున, రష్మిక, ధనుష్ ముగ్గురు ఉన్న కొత్త పోస్టర్ రిలీజ్ చేసి టీజర్ కార్తీక పౌర్ణమి నాడు నవంబర్ 15న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఇక ఈ సినిమాలో ధనుష్ బిచ్చగాడిలా నటిస్తున్నాడని సమాచారం. ఈ సినిమా కథాంశం డబ్బు చుట్టూ తిరుగుతుందని తెలుస్తుంది. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

 

Image