Kajal Aggarwal : కాజల్ ప్రెగ్నెంటా..?
త్వరలో కాజల్ అగర్వాల్ చెప్పనున్న గుడ్ న్యూస్ గురించి సోషల్ మీడియాలో న్యూస్, మీమ్స్ వైరల్ అవుతున్నాయి..

Kajal Aggarwal
Kajal Aggarwal: దశాబ్ద కాలానికి పైగా టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా కొనసాగింది కలువ కళ్ల చిన్నది కాజల్ అగర్వాల్. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగానే ప్రియుడు గౌతమ్ కిచ్లుని పెళ్లాడింది. పాండమిక్ టైంలో గతేడాది అక్టోబర్ 30న వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
Bigg Boss 5 Telugu : ‘లవ్ స్టోరీ’ కోసం చైతు – సాయి పల్లవి..
పెళ్లి తర్వాత కాజల్, మంచు విష్ణు సోదరిగా నటించిన ‘మోసగాళ్లు’ రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి పక్కన యాక్ట్ ‘ఆచార్య’ మూవీతో పాటు కింగ్ నాగార్జున – ప్రవీణ్ సత్తారు సినిమాలోనూ నటిస్తోంది. ఇటీవల ‘లైవ్ టెలికాస్ట్’ అనే హారర్ సిరీస్‌తోనూ ఆకట్టకుంది.
Naveen Polishetty : త్రివిక్రమ్‌తో నవీన్ సినిమా..
అయితే కొద్ది రోజులుగా కాజల్ త్వరలో గుడ్ న్యూస్ చెప్పబోతోందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. కాజల్ కిచ్లు ప్రస్తుతం ప్రెగ్నెంట్ అని, అందుకే చేతిలో ఉన్న సినిమాలు తప్ప కొత్తవి కమిట్ అవడంలేదని.. తను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని అఫీషియల్‌గా అనౌన్స్ చెయ్యనుందంటూ న్యూస్‌తో పాటు మీమ్స్ వైరల్ అవుతున్నాయి.. అయినా కాజల్ సైలెంట్‌గా ఉందంటే ఈ వార్తలు నిజమే అనుకోవాలని కొందరు.. కాజల్ క్లారిటీ ఇస్తే కానీ ఏ విషయం అనేది వివరంగా తెలియదని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram