Kajol : ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోన్న మరో స్టార్ బ్యూటీ.. ఎవరంటే?
ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫాంల ట్రెండ్ నడుస్తోంది. కంటెంట్‌లో కొత్తదనాన్ని అందించడంలో మెజారిటీ ఓటీటీ ప్లాట్‌ఫాంలు సక్సెస్ అవుతుండటంతో జనం వీటిపై ఎక్కువ....

Kajol Announces Her Ott Debut With A Web Series
Kajol: ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫాంల ట్రెండ్ నడుస్తోంది. కంటెంట్‌లో కొత్తదనాన్ని అందించడంలో మెజారిటీ ఓటీటీ ప్లాట్‌ఫాంలు సక్సెస్ అవుతుండటంతో జనం వీటిపై ఎక్కువ ఆసక్తిని కనబరుస్తున్నారు. అంతేగాక, కొత్త సినిమాలు కూడా చాలా తక్కువ సమయంలోనే ఓటీటీలో అందుబాటులోకి వస్తుండటంతో ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా ఈ ఓటీటీలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు.
Kajol: వామ్మో.. కాజోల్ డిమాండ్ మామూలుగా లేదుగా!
అయితే ఆడియెన్స్ పల్స్ తెలుసుకుంటున్న స్టార్స్ కూడా వారి అభిరుచికి అనుగుణంగా ఓటీటీలో పలు వెబ్‌సిరీస్‌లు, సినిమాలు చేస్తూ తమ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు ఇదే బాటలో ఓ బాలీవుడ్ బ్యూటీ కూడా పయనించేందుకు రెడీ అయ్యింది. బాలీవుడ్ అందాల భామ కాజోల్(Kajol) సినిమాల్లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లో సెలెక్టెడ్ క్యారెక్టర్స్ చేస్తున్న ఈ బ్యూటీ, ఇప్పుడు డిజిటల్ ఎంట్రీకి రెడీ అయ్యింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌పాం డిస్నీప్లస్(Disney+ Hotstar) హాట్‌స్టార్‌లో ఓ వెబ్ సిరీస్‌లో నటించేందుకు కాజోల్ రెడీ అయ్యింది.
Kajol : 12 కోట్లతో రెండు ప్లాట్లు కొనుగోలు చేసిన కాజోల్..
దీనికి సంబంధించి తాజాగా ఓ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా చేసింది. కాగా ఈ వెబ్ సిరీస్‌ను ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ డైరెక్టర్ సుపర్ణ్ వర్మ తెరకెక్కించబోతున్నట్లు బీటౌన్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ బ్యూటీ చేయబోతున్న తొలి వెబ్ సిరీస్‌కు ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ ఓటీటీలోకి వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.
Kuch kuch ho raha hai, tum nahi samjhoge.
Can you guess what we’re up to? ? @itsKajolD pic.twitter.com/3pzmgn6PGy— Disney+ Hotstar (@DisneyPlusHS) July 18, 2022