Kajol : రాజకీయ నాయకుల పై కాజోల్ వ్యాఖ్యలు వివాదం అవ్వడంతో.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..
బాలీవుడ్ నటి కాజోల్ ఇటీవల రాజకీయ నాయకుల పై చేసిన కామెంట్స్ వివాదంగా మారాయి. దీంతో ఆమె క్లారిటీ ఇచ్చే..

Kajol gave clarity on her controversial comments about political leaders
Kajol : బాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. ఈ భామ ఈ ఏడాది సినిమాలు, సిరీస్ తో వరుసగా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే ఇటీవల లస్ట్ స్టోరీస్ 2 (Lust Stories 2) తో ఆడియన్స్ ముందుకు వచ్చిన కాజోల్.. ఇప్పుడు ‘ది ట్రైల్’ (The Trial) అనే వెబ్ సిరీస్ ని సిద్ధం చేస్తుంది. జులై 14 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ సిరీస్ ప్రసారం కాబోతుంది.
Salman Khan : స్టేజి పై సిగరెట్‌తో కనిపించిన సల్మాన్‌ఖాన్.. ఫైర్ అవుతున్న నెటిజెన్స్.. పిక్ వైరల్!
ఇక ఈ సిరీస్ ప్రమోషన్ లో ఉన్న కాజోల్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “సమాజంలో మార్పు అనేది అవసరం. కానీ ఇండియాలో ఆ మార్పు చాలా నిదానంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఆలోచనా విధానం, సంప్రదాయాలతో మనం నిమగ్నమైపోయాం. దీని వల్ల మన విద్య పై ఎంతో ప్రభావం పడుతుంది. ఇలా మాట్లాడుతున్నందుకు క్షమించాలి. మనల్ని పాలించే నాయకుల్లో చాలా మందికి విద్యావ్యవస్థ పై సరైన అవగాహన లేదు” అంటూ వ్యాఖ్యానించింది.
I was merely making a point about education and its importance. My intention was not to demean any political leaders, we have some great leaders who are guiding the country on the right path.
— Kajol (@itsKajolD) July 8, 2023
ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని లేపాయి. కాజోల్ చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ పలువురు రాజకీయనేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ వ్యాఖ్యలు కాస్త వివాదంగా మారుతుండడంతో కాజోల్ సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చింది. “చదువు యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడడమే నా ముఖ్య ఉద్దేశం గాని ఎవర్ని తక్కువ చేసి మాట్లాడడం కాదు. అభివృద్ధి దిశలో నడుపుతున్న గొప్ప నాయకులు సైతం మనకి ఉన్నారు” అంటూ ట్వీట్ చేసింది. మరి ఈ వివాదం ఇక్కడితో ముగిసిపోతుందా? లేదా? చూడాలి.