ప్రభాస్ తాజా సినిమా కల్కి ‘కల్ని 2898 ఏడీ’ రిలీజ్ ట్రైలర్ ను ఆ సినిమా యూనిట్ విడుదల చేసింది. ఎన్ని యుగాలైనా, ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి మారడు మారలేడు అనే డైలాగ్ అదుర్స్ అనిపిస్తోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఈ సినిమా జూన్ 27న విడుదల కానుంది. ఇప్పటికే మెయిన్ ట్రైలర్ ను కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే.
‘కల్కి 2898 ఏడీ’ సినిమాను సైన్స్ ఫిక్షన్, ఫ్యూచరిస్టిక్ ఫిల్మ్‌గా రూపొందించారు. అమితాబ్ బచ్చన్, కమలహాసన్, దీపికా పదుకోన్, దిశా పటానీ నటించారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ భైరవ పాత్రలో కనపడుతున్నాడు.
అతడి వాహనం బుజ్జికి సంబంధించిన దృశ్యాలను ఈ సినిమా టీమ్ ఇప్పటికే విడుదల చేయగా, అవి అందరినీ అలరించాయి. ప్రభాస్ ఈ సినిమాలో పెద్ద ఎత్తున సాహసాలు చేస్తున్నట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. ఇందులో యాక్షన్ సీన్లు అదరగొట్టేలా ఉన్నాయి. ట్రైలర్‌లో ప్రభాస్ కనపడుతోన్న తీరు గూస్ బంప్స్ తెప్పించాయి.
Itlu Mee Cinema : ‘ఇట్లు… మీ సినిమా’ మూవీ రివ్యూ.. సినిమా వాళ్ళ కష్టాలు..