Itlu Mee Cinema : ‘ఇట్లు… మీ సినిమా’ మూవీ రివ్యూ.. సినిమా వాళ్ళ కష్టాలు..

సినిమాల్లో రాణిద్దామని వస్తే ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నారు, సక్సెస్ అయ్యారా అనే కథాంశంతో ఈ సినిమాని తెరకెక్కించారు.

Itlu Mee Cinema : ‘ఇట్లు… మీ సినిమా’ మూవీ రివ్యూ.. సినిమా వాళ్ళ కష్టాలు..

Film Industry Story Itlu Mee Cinema Movie Review & Rating

Itlu Mee Cinema : అభి రామ్, వెన్నెల, మనోహర్, పవన్, కృష్ణ, మంజుల హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా ‘ఇట్లు… మీ సినిమా’. హరీష్ చావా దర్శకత్వంలో లిటిల్ బేబీస్ క్రియేషన్స్ బ్యానర్ పై నోరి నాగ ప్రసాద్ నిర్మాతగా ఈ సినిమాని తెరకెక్కించారు. ప్రదీప్, అమ్మ రమేష్.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. ‘ఇట్లు… మీ సినిమా’ నేడు జూన్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కథ విషయానికొస్తే.. రామ్(అభిరామ్) సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తుంటాడు. కానీ సినిమాల మీద ప్యాషన్ తో తన జాబ్ ని వదిలేసి సినిమాల్లోకి వస్తాడు. దర్శకుడు అవ్వాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో అతనికి మరో ముగ్గురు(పవన్, మనోహర్, కృష్ణ) పరిచయం అవుతారు. వాళ్ళది కూడా సినిమా కష్టాలే. ఎన్ని ప్రయత్నాలు చేసినా సినిమా అవకాశాలు రాకపోవడంతో వీళ్ళే క్రౌడ్ ఫండింగ్ ద్వారా సినిమా తీద్దాం అనుకుంటారు. మరో పక్క రామ్ లవర్ జాను(వెన్నెల) తనని పెళ్ళిచేసుకోవాలని అడుగుతూ ఉంటుంది. మరి రామ్, ఆ నలుగురు కలిసి సినిమా తీసారా? సినిమా రంగంలో సక్సెస్ అయ్యారా? రామ్ – జాను లవ్ స్టోరీ ఏమైంది? సినిమా కష్టాలు ఏంటి తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Prabuthwa Junior Kalashala : ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల’ రివ్యూ.. 90s కిడ్స్‌కి తొలిప్రేమ గుర్తుకొస్తుంది..

సినిమా విశ్లేషణ.. సినిమా ఇండస్ట్రీ కష్టాలపై ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. ఈ సినిమా కూడా అంతే. అందరూ కొత్తవాళ్లతో సినిమాల్లో రాణిద్దామని వస్తే ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నారు, సక్సెస్ అయ్యారా అనే కథాంశంతో ఈ సినిమాని తెరకెక్కించారు. ఫస్ట్ హాఫ్ అంతా నలుగురు కుర్రాళ్ళు, ఇంకొంతమంది సినిమా అవకాశాల కోసం తిరగడం, సినిమా కష్టాలు చూపిస్తారు. ఇక సెకండ్ హాఫ్ ఈ కష్టాలతో విసిగిపోయిన వాళ్ళు వాళ్ళే సినిమా ఎందుకు తీయకూడదు అనే ఆలోచనతో ఏం చేసారు అని చూపిస్తారు.

అలాగే సినిమా ఇండస్ట్రీలో డబ్బులిస్తే అవకాశాలు అని జరిగే మోసాలు, క్యాస్టింగ్ కౌచ్.. లాంటివి చాలానే చూపించారు సినిమాలో. దర్శకుడు తాను పడ్డ సినిమా కష్టాలన్నీ కూడా ఈ సినిమాలో పెట్టినట్టు అనిపిస్తుంది. సినిమాల మీద, సినిమా రంగం మీద ఆసక్తి ఉన్న వాళ్లకు, సినిమా పరిశ్రమలో కష్టాలు పడేవారికి ఈ సినిమా నచ్చుతుంది.

నటీనటుల పర్ఫార్మెన్స్.. సాఫ్ట్ వేర్ జాబ్ వదిలేసి సినిమాల్లో రాణించాలని పాత్రలో అభిరామ్ ఓకే అనిపించాడు. అతని లవర్ పాత్రలో వెన్నెల మెప్పిస్తుంది. అభిరామ్ తో పాటు ఉండే మిగిలిన ముగ్గురు కుర్రాళ్ళు పర్వాలేదనిపిస్తారు. టీ స్టాల్ రాణి పాత్రలో మంజుల మాత్రం మెప్పిస్తుంది. మిగిలిన నటీనటులు కూడా పర్వాలేదనిపిస్తారు.

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ ఇంకొంచెం బాగుంటే బెటర్ అనిపిస్తుంది. పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు అనిపిస్తాయి. డైలాగ్స్ బాగుంటాయి. నిర్మాణ పరంగా కూడా చిన్న సినిమా అయినా బానే ఖర్చుపెట్టారు. దర్శకుడిగా మొదటి సినిమాతో హరీష్ పర్వాలేదనిపించారు.

మొత్తంగా ‘ఇట్లు మీ సినిమా’ సినీ పరిశ్రమ, సినిమా వాళ్ళ కష్టాలు, పరిస్థితులు చూపించి కొంతమంది ఎలా సక్సెస్ అయ్యారు అని తెరకెక్కించారు. ఈ సినిమాకు రేటింగ్ 2.75 ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.