Prabuthwa Junior Kalashala : ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల’ రివ్యూ.. 90s కిడ్స్‌కి తొలిప్రేమ గుర్తుకొస్తుంది..

‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′ సినిమా 2004లో ఓ ఇంటర్ కాలేజీలో జరిగిన ప్రేమ కథ. 90s కిడ్స్ మాత్రం ఈ సినిమాని థియేటర్ కి వెళ్లి చూడాల్సిందే.

Prabuthwa Junior Kalashala : ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల’ రివ్యూ.. 90s కిడ్స్‌కి తొలిప్రేమ గుర్తుకొస్తుంది..

Prabuthwa Junior Kalashala Punganuru Movie Review and Rating

Prabuthwa Junior Kalashala Movie Review : ప్రణవ్ ప్రీతం, షాజ్ఞ శ్రీ వేణున్ జంటగా డైరెక్టర్ శ్రీనాథ్ పులకురం దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′. బ్లాక్ యాంటీ పిక్చర్స్ బ్యానర్ పై శ్రీమతి కొవ్వూరి అరుణ సమర్పణలో భువన్ రెడ్డి కొవ్వూరి ఈ సినిమాని నిర్మించగా రామ్ పటాస్, తేజ గౌడ్, బాంబే పద్మ, శ్రీమునిచంద్ర.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా నేడు జూన్ 21న విడుదల అయింది.

కథ విషయానికొస్తే.. ఈ కథ 2004లో పుంగనూరులో జరుగుతుంది. వాసు(ప్రణవ్ ప్రీతం) గవర్నమెంట్ కాలేజీలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతుంటారు. అదే కాలేజీలో కుమారి(షాజ్ఞ శ్రీ వేణున్) కూడా ఇంటర్ చదువుతుంది. వేరు వేరు బ్రాంచీలు అయినా వీరిద్దరికి అనుకోకుండా పరిచయం అయి ఫ్రెండ్స్ అవుతారు. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారుతుంది. అంతా బాగున్న సమయంలో కుమారి గురించి కొన్ని విషయాలు వినడంతో ఆమెతో గొడవపడతాడు వాసు. కుమారి కూడా వాసుని దూరం పెడుతుంది. ఆ తర్వాత వాసు పురుగులమందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేస్తాడు. అసలు కుమారి గురించి వాసు ఏం తెలుసుకున్నాడు? వాసు ఎందుకు ఆత్మహత్య ప్రయత్నం చేసాడు? వీరిద్దరి లవ్ స్టోరీ ఏమైంది తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Honeymoon Express : ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ మూవీ రివ్యూ.. రొమాంటిక్ ఎంటర్టైనర్..

సినిమా విశ్లేషణ.. స్కూల్, ఇంటర్ కాలేజీ లవ్ స్టోరీలతో 10th క్లాస్, కొత్తబంగారులోకం.. లాంటి చాలా సినిమాలు వచ్చి హిట్ కొట్టాయి. ఈ సినిమా కూడా అదే కోవలో వచ్చింది. అయితే ఇది 2004లో జరిగిన కథ కావడంతో అప్పటి కాలేజీ యువత ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ చుట్టూ పరిసరాలు, సన్నివేశాలు, అప్పటి పరిస్థితులు చాలా బాగా చూపించారు. ప్రతి మనిషికి స్కూల్, కాలేజీ లెవెల్లో ఓ తొలిప్రేమ ఉంటుంది. ఆ పాయింట్ లోనే ఈ సినిమా తీశారు.

ఫస్ట్ హాఫ్ అంతా కాలేజీ, కాలేజీలో స్టూడెంట్స్ సందడి, వాసు – కుమారిల పరిచయం, ప్రేమ చూపిస్తారు. ఇక సెకండ్ హాఫ్ లో ప్రేమలో గొడవలు చూపిస్తారు. అక్కడక్కడా కామెడీ వర్కౌట్ అయింది. ఇలాంటి కథల్లో కొత్తగా చూపించడానికి ఏం లేకపోయినా ఎలా చూపించారు అనేది ముఖ్యం. ఇంటర్ కాలేజీ కథని చాలా క్యూట్ గా చూపించారు. 90s కిడ్స్ మాత్రం ఈ సినిమాకు కచ్చితంగా కనెక్ట్ అవుతారు. హీరో – హీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీ మాత్రం బాగా వర్కౌట్ అయింది.

నటీనటుల పర్ఫార్మెన్స్.. ఆల్రెడీ పలు షార్ట్ ఫిలిమ్స్ తో మెప్పించిన ప్రణవ్ ఈ సినిమాలో మొదటిసారి ఇంటర్ కాలేజీ స్టూడెంట్ లా బాగానే నటించాడు. ఇక షాజ్ఞ కూడా క్యూట్ గా కాలేజీ అమ్మాయిలా కనిపించి అలరించింది. ఈ సినిమాలో మెయిన్ ఈ రెండు పాత్రలే. చాలా వరకు కథ వీళ్ళ చుట్టే తిరుగుతుంది. మిగిలిన పాత్రలు కూడా పర్వాలేదనిపించారు.

సాంకేతిక అంశాలు.. ముఖ్యంగా ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా రిచ్ గా ఉన్నాయి. పాటలు ఓకే అనిపించినా లవ్ స్టోరీకి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బాగుంది. డైరెక్టర్ శ్రీనాథ్ దర్శకుడిగా, ఎడిటర్ గా, రచయితగా పనిచేసి అన్ని విభాగాల్లోనూ సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. ఇక నిర్మాణ పరంగా కూడా బాగానే ఖర్చుపెట్టారు.

మొత్తంగా ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′ సినిమా 2004లో ఓ ఇంటర్ కాలేజీలో జరిగిన ప్రేమ కథ. 90s కిడ్స్ మాత్రం ఈ సినిమాని థియేటర్ కి వెళ్లి చూడాల్సిందే. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.