Kalki 2898 AD trailer : ప్రభాస్ ‘కల్కి 2898AD’ ట్రైలర్ డేట్ ఫిక్స్ అయిందా??
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం ‘కల్కి 2898AD’.

Kalki 2898 AD trailer to be out on this date
Kalki 2898 AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం ‘కల్కి 2898AD’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్నఈ చిత్రంలో బాలీవుడ్ భామ దీపికా పదుకొనే హీరోయిన్. బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా నటిస్తుండగా, లోకనాయకుడు కమల్ హాసన్ ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నారు. దిశా పటానీ కీలక పాత్రలో నటిస్తున్న ఈమూవీని వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ మూవీ జూన్ 27 ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్, బుజ్జిని పరిచయం.. ఇవన్నీ ఆకట్టుకున్నాయి. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ట్రైలర్‌ను విడుదల చేసేందుకు చిత్ర బృందం కసరత్తు చేస్తోంది. ట్రైలర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా.. ట్రైలర్‌ను జూన్ 7 విడుదల చేయనున్నట్లు ఫిల్మ్‌నగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. దీనిపై చిత్ర బృందం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
Maharaja trailer : మహారాజా ట్రైలర్.. సస్పెన్స్‌తో చంపేశాడుగా.. అసలు ఆ లక్ష్మి ఎవరయ్యా..
భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.