Maharaja trailer : మహారాజా ట్రైలర్.. సస్పెన్స్‌తో చంపేశాడుగా.. అసలు ఆ లక్ష్మి ఎవరయ్యా..
వర్సటైట్ యాక్టర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు కోలీవుడ్ స్టార్ నటుడు విజయ్ సేతుపతి.

Maharaja trailer
Vijay Sethupathi Maharaja trailer : వర్సటైట్ యాక్టర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు కోలీవుడ్ స్టార్ నటుడు విజయ్ సేతుపతి. కథను నమ్మి సినిమా చేసే అతికొద్ది మంది నటుల్లో ఆయన ఒకరు. ఆయన ఓ చిత్రంలో నటిస్తున్నారు అంటే అందులో సాలిడ్ కంటెంట్ ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తూ ఉంటారు. ఆయన చేసే సినిమాలు తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల అవుతుంటాయి.
విజయ్ సేతుపతి నటిస్తున్న చిత్రం మహారాజా. ఆయన కెరీర్‌లో 50వ సినిమా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నిధిలన్ స్వామినాథన్ దర్శకుడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. పోలీస్ స్టేషన్ వచ్చిన మహారాజా తన ఇంట్లో లక్ష్మి కనిపించడం లేదని కేసు నమోదు చేయాల్సిందిగా కోరుతాడు. లక్ష్మి అంటే నగలు, పెట్టెలు, డ్యాకుమెంట్లు కాదని అంటాడు. అలాగే భార్య కాదని, సోదరి కాదని చెబుతాడు. అసలు లక్ష్మి ఎవరో పోలీసులు తెలుసుకోలేకపోయారు.
Weapon trailer : సత్యరాజ్ ‘వెపన్’ ట్రైలర్ చూశారా..? సస్పెన్స్ థ్రిలర్..!
అసలు లక్ష్మి ఎవరు ? అనేది క్యూరియాసిటీని పెంచింది. ఆఖర్లో బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌ను చూపించారు. మొత్తంగా ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. ప్యాషన్ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్, మమతా మోహన్ దాస్, నట్టి, భారతీరాజా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు.