Kalki Part 2 : అసలు కల్కి కథ పార్ట్ 2లో.. కలియుగాంతం మహాభారత పాత్రలు తిరిగొస్తాయా?

ఈ సినిమా క్లైమాక్స్ లో అదిరిపోయే ట్విస్ట్ తో పార్ట్ 2కి లీడ్ ఇవ్వడమే కాకుండా కల్కి సినిమాటిక్ యూనివర్స్ అని ప్రకటించారు.

Kalki Part 2 : ప్రభాస్ కల్కి 2898AD సినిమా నేడు థియేటర్స్ లో గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా రిలీజయి ఫుల్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఇక సినిమా భారీ బడ్జెట్, స్టార్ నటీనటులు, అదిరిపోయే యాక్షన్ సీన్స్, మహాభారతం విజువల్స్, ఎమోషన్.. ఇలా అన్ని అంశాలతో ప్రేక్షకులని మెప్పిస్తుంది. సినిమా ఇప్పటికే అనేక షోలు పడటంతో సినిమా కథ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

కల్కి సినిమా ప్రీ ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు అదిరిపోతుంది. చాలా ఎలివేషన్ షాట్స్, హై మూమెంట్స్ ఉంటాయి. కలియుగాంతంలో కల్కి వస్తాడని మన పురాణాల ప్రకారం తెలిసిందే. అయితే ఈ సినిమాలో కల్కి కడుపులో ఉన్నట్టు, ప్రగ్నెన్సీ ఉన్న మహిళను కాపాడటంతోనే సాగుతుంది. ఈ కథకు మహాభారతానికి లింక్ ఇచ్చి అదరగొట్టారు. అయితే అసలు కల్కి కథ మాత్రం నెక్స్ట్ పార్ట్ లోనే సాగుతుంది.

Also Read : Kalki 2898 AD Review : ‘కల్కి 2898AD’ మూవీ రివ్యూ.. పుట్టబోయే దేవుడి కోసం యుద్ధం..

ఈ సినిమా క్లైమాక్స్ లో అదిరిపోయే ట్విస్ట్ తో పార్ట్ 2కి లీడ్ ఇవ్వడమే కాకుండా కల్కి సినిమాటిక్ యూనివర్స్ అని ప్రకటించారు. దీంతో ఈ సినిమాటిక్ యూనివర్స్ లో ఈ కథకు లింక్ తో మరిన్ని సినిమాలు ఉండబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాలో ఆల్రెడీ మహాభారతంలోని అర్జునుడు, కృష్ణుడు, కర్ణుడు, అశ్వత్థామ పాత్రలు చూపించారు. ఈ సినిమాలో చూపించిన కథ, క్లైమాక్స్ ప్రకారం సెకండ్ పార్ట్ లో కల్కి పుట్టడం, మహాభారతంలోని అర్జునుడు, కర్ణుడు, అశ్వత్థామ పాత్రలు కూడా రావొచ్చని తెలుస్తుంది. కృష్ణుడి పాత్ర ఉన్నా ఆశ్చర్యపోనవసరం లేదు. దీంతో కలియుగాంతంలో మహాభారతంలోని చాలా పాత్రలు కల్కి పుట్టుక కోసం రావడం, కలితో పోరాడటం జరుగుతుందని తెలుస్తుంది. మరి ఈ ఒక్క సినిమాతోనే చాలా హై ఇచ్చిన నాగ్ అశ్విన్ ఇంకా ముందు ముందు ఏం ప్లాన్ చేసాడో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు