Kalyan Ram announce his 21 movie with Raja Cheyyi Vesthe director Pradeep Chilukuri
NKR21 : నందమూరి కళ్యాణ్ రామ్ (Kalyan Ram) పుట్టినరోజు ఈరోజు (జులై 5) కావడంతో.. అతని కొత్త సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ని మేకర్స్ బర్త్ డే గిఫ్ట్ గా ఆడియన్స్ కి ఇస్తున్నారు. ఈ క్రమంలోనే కళ్యాణ్ రామ్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ గా నటిస్తున్న ‘డెవిల్’ (Devil) చిత్రం నుంచి ఉదయం అదిరిపోయే అప్డేట్ వచ్చింది. తాజాగా ఇప్పుడు మరో కొత్త సినిమా నుంచి అప్డేట్ వచ్చేసింది. కళ్యాణ్ రామ్ తన కెరీర్ లో 21వ సినిమాని అశోక్ వర్ధన్ ముప్ప, సునీల్ బలుసు ‘అశోక క్రియేషన్స్’ బ్యానర్ పై నిర్మించబోతున్నారు.
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ మూడో పెళ్లి విడాకుల వార్తలు నిజమేనా..? జనసేనాని పై జరుగుతున్న కుట్ర..!
కళ్యాణ్ రామ్ సొంత నిర్మాణ సంస్థ ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగం కానుంది. గతంలో నారా రోహిత్, నందమూరి తారకరత్న ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘రాజా చెయ్యి వేస్తే’ సినిమాకు దర్శకత్వం వహించిన ప్రదీప్ చిలుకూరి ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. హరికృష్ణ భండారి స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ మొదలు కానున్నట్లు వెల్లడించారు. అలాగే ఈ మూవీ కోసం పని చేసే సాంకేతిక నిపుణులను, నటీనటులను కూడా త్వరలో ప్రకటించనున్నారు.
Krithi Shetty : హమ్మయ్య మరో ఛాన్స్ అందుకున్న బేబమ్మ.. తమిళ్ స్టార్ హీరో సరసన పాన్ ఇండియా చిత్రం..
ఈ సినిమాలో కళ్యాణ్ పూర్తి యాక్షన్ రోల్ లో కనిపించబోతున్నట్లు తెలియజేశారు. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ ని కూడా మాస్ గా డిజైన్ చేశారు. ఓం 3D తరువాత కళ్యాణ్ పూర్తి స్థాయి యాక్షన్ రోల్ లో కనిపించలేదు. గతంలో అతనొక్కడే, అసాధ్యుడు వంటి సినిమాల్లో కళ్యాణ్ రామ్ యాక్షన్ సన్నివేశాలతో అలరించాడు. ఇప్పుడు ఆ చిత్రాల్లో మాదిరి మళ్ళీ ఈ సినిమాలో యాక్షన్ తో కళ్యాణ్ రామ్ అదరగొడతాడని నందమూరి ఫ్యాన్స్ ఆసక్తి చూపిస్తున్నారు.
The FIST of FURY ???@NANDAMURIKALYAN in an action-packed powerful role ❤️?#NKR21 shoot begins soon ?#HappyBirthdayNKR @PradeepChalre10 #AshokaMuppa @SunilBalusu1981 @harie512 @AshokaCOfficial pic.twitter.com/qb9S2TwCee
— NTR Arts (@NTRArtsOfficial) July 5, 2023