Kalyan Ram commented Devara is greater than Game of Thrones
Devara : కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. RRR తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడం, మేకర్స్ కూడా ఈ సినిమా మోస్ట్ వైలెంట్ అండ్ మాస్ గా ఉంటుందని చెబుతూ వస్తుండడంతో ఆడియన్స్ లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ అంచనాలను అంచుకునేలా కళ్యాణ్ రామ్ కూడా ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీపడకుండా నిర్మిస్తున్నారు.
కాగా కళ్యాణ్ రామ్ నటించిన కొత్త చిత్రం ‘డెవిల్’.. ఈ శుక్రవారం రిలీజ్ కాబోతుంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో ఉన్న కళ్యాణ్ రామ్.. దేవర గురించి ఆసక్తికర కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. ఈక్రమంలోనే దేవర కథ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ మూవీ స్టోరీ 1990’s బ్యాక్ డ్రాప్ లో సాగుతుందట. ఈ సినిమా ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ కంటే గొప్పగా ఉంటుందని చెప్పుకొచ్చారు.
Also read : Mega156 : సలార్ నటుడు చిరంజీవి సినిమాలో విలన్‌గా..!
అయితే ఈ చిత్రాన్ని చాలా కొత్తగా తెరకెక్కిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ లేదు ఏ ఇతర సినిమాకి దీనికి పోలిక ఉండదని చెప్పుకొచ్చారు. ఇక అలాగే కొరటాల శివని తమని ఎందుకు అంతలా నమ్మమో అన్నది దేవర టీజర్ చూసిన తరువాత అందరికి అర్థమవుతుందని వెల్లడించారు. కాగా ఈ టీజర్ ని జనవరి 8న రిలీజ్ చేయబోతున్నారని టాక్ వినిపిస్తుంది.
ఆల్రెడీ ఈ టీజర్ కూడా రెడీ అయ్యిపోయినట్లు తెలుస్తుంది. ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న అనిరుధ్ టీజర్ అదిరిపోయిందని, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చేయడానికి చాలా ఆసక్తితో ఉన్నట్లు పేర్కొన్నారు. దీంతో ఆడియన్స్ లో టీజర్ పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ నటిస్తూ తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్, మలయాళం స్టార్ షైన్ టామ్ చాకో లు విలన్స్ గా కనపడబోతున్నారు.