Mega156 : సలార్ నటుడు చిరంజీవి సినిమాలో విలన్‌గా..!

మెగాస్టార్ చిరంజీవి Mega156 లో సలార్ నటుడు విలన్‌గా కనిపించబోతున్నాడట.

Mega156 : సలార్ నటుడు చిరంజీవి సినిమాలో విలన్‌గా..!

Salaar actor is casting for Megastar chiranjeevi 156 movie

Updated On : December 27, 2023 / 7:58 PM IST

Mega156 : మెగాస్టార్ చిరంజీవి బింబిసారా దర్శకుడు వశిష్ఠతో తన 156 సినిమాని చేయబోతున్న సంగతి తెలిసిందే. సోషియో ఫాంటసీ డ్రామాతో తెరకెక్కబోతున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే మారేడుమిల్లి అడవుల్లో ప్రారంభించారు. అయితే చిరంజీవి మాత్రం ఈ మూవీ సెట్స్ లోకి అడుగు పెట్టలేదు. సంక్రాంతి తరువాత నుంచి మెగాస్టార్ ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తుంది.

ఇక ఈ మూవీలో ఏ స్టార్ క్యాస్ట్ నటించబోతున్నారు అని అందరిలో ఆసక్తి నెలకుంది. ఈక్రమంలోనే కొన్ని పేరులు ఫిలిం వర్గాల్లో వినిపిస్తున్నాయి. రానా దగ్గుబాటి ఈ చిత్రంలో ముఖ్యం పాత్ర చేయబోతున్నారని, త్రిష ఫిమేల్ లీడ్ చేయనున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో నటుడి గురించి కూడా ఒక న్యూస్ వినిపిస్తున్నాయి. సలార్ లో నటించిన ఓ నటుడు ఈ సినిమాలో విలన్ గా కనిపించబోతున్నాడట.

Also read : Salaar : ఖాన్సార్ నిబంధన అంటూ హుకుం జారీ చేసిన రాజమన్నార్.. ఏంటో తెలుసా..?

సలార్ సెకండ్ హాఫ్ లో ‘కటేరమ్మ’ ఫైట్ సీక్వెన్స్ అందరికి గుర్తుకు ఉండే ఉంటుంది. ఆ ఫైట్ లో మెయిన్ ఫైటర్ గా కనిపించిన వజ్రంగ్ శెట్టి.. చిరంజీవి మూవీలో ఓ విలన్ పాత్రలో కనిపించబోతున్నారట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఈ వార్తలో నిజమెంత తెలియాలంటే వేచి చూడాల్సిందే. కాగా ఈ మూవీకి చోట కె నాయుడు సినిమాటోగ్రఫీ, కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాని దాదాపు 75 శాతం VFX పైనే తెరకెక్కించబోతున్నారట. చిరంజీవి కెరీర్ లోనే హై బడ్జెట్ తో ఈ మూవీని నిర్మించబోతున్నారు. ఇక ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేయనప్పటికీ ఇటీవల ఈ మూవీ స్క్రిప్ట్ కి సంబంధించిన ఒక పేపర్ నెట్టింట లీక్ అవ్వడంతో.. ఈ చిత్రానికి ‘విశ్వంభర’ అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు తెలుస్తుంది. మరి భోళా శంకర్ తో ప్లాప్ ని అందుకున్న చిరు ఈ మూవీతో సూపర్ హిట్ అందుకుంటారేమో చూడాలి.