Devil : కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ మూవీ దర్శకనిర్మాతల మధ్య విబేధం.. ట్వీట్ వైరల్!

కళ్యాణ్ రామ్ 'డెవిల్' మూవీ దర్శకనిర్మాతల మధ్య విబేధం వచ్చిందా..? మూవీ నుంచి దర్శకుడు నవీన్ తప్పుకున్నాడా..?

Kalyan Ram Devil movie director naveen and producer abhishek nama conflict

Devil : నందమూరి హీరో కళ్యాణ్ రామ్ (Kalyan Ram) నటిస్తున్న తాజా చిత్రం ‘డెవిల్’. బ్రిటిష్ కాలంలో ఉండే సీక్రెట్ ఏజెంట్ కథ నేపథ్యంతో ఈ మూవీ తెరకెక్కబోతుంది. కొత్త దర్శకుడు నవీన్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. అభిషేక్ పిక్చర్స్ నిర్మాణంలో అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. సంయుక్త మీనన్ (Samyuktha Menon) ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. కాగా ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సాంగ్ ని రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధమయ్యారు. ఈక్రమంలోనే సినిమాలోని ‘మాయే చేసే’ అనే సాంగ్ కి సంబంధించిన ఒక అప్డేట్ ఇస్తూ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు.

Shruti Haasan : సేల్స్ గర్ల్‌గా పని చేయాలని అనుకున్నా.. కానీ నటిని అయ్యాను..

ఆ పోస్టర్ లో దర్శకుడు నవీన్ పేరుని తీసేసి నిర్మాత అభిషేక్ నామా తన పేరుని వేసుకున్నాడు. ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ అభిషేక్ నామా అని పోస్టర్ లో చూడవచ్చు. ఇక ఇది ఇలా ఉంటే, దర్శకుడు నవీన్ తన ట్విట్టర్‌లో.. “వినాశకాలే విపరీత బుద్ధి” అంటూ ఒక ట్వీట్ చేశాడు. ఇప్పుడు ఆ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది. పోస్టర్ నుంచి తన పేరుని తీసుకోని నిర్మాత పేరు వేయడంతోనే నవీన్ ట్వీట్ కి కారణం అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఈ ట్వీట్ తో వీరిద్దరి మధ్య ఉన్న విబేధాలు బయట పడ్డాయి. అసలు దర్శకనిర్మాతల మధ్య ఏమి జరిగిందో అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

Nayanthara : నయనతార అమ్మకు విగ్నేష్ పుట్టినరోజు శుభాకాంక్షలు.. పిక్స్ చూశారా..?

కాగా నిర్మాత అభిషేక నామా ఇటీవల విజయ్ దేవరకొండ విషయంలో చేసిన ట్వీట్ కూడా బాగా వైరల్ అయ్యింది. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ మూవీకి 8 కోట్ల నష్టం జరిగిందని, వాటిని పూర్చమని కోరుతూ ట్వీట్ చేయడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. అది జరిగి కొన్నిరోజులు గడవకముందే.. ఇప్పుడు డెవిల్ మూవీ విషయంలో నెట్టింట వైరల్ అవుతున్నాడు. మరి నిర్మాత అభిషేక్ నామా దీనిపై ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. కాగా ఈ మూవీని నవంబర్ 24న రిలీజ్ చేయనున్నారు.