Kalyan Ram Family : కళ్యాణ్ రామ్ భార్య, పిల్లల్ని చూశారా? కొడుకు, కూతురు ఎంత పెద్దవాళ్ళైపోయారో.. మరో నందమూరి వారసుడు..
కళ్యాణ్ రామ్ పిల్లలు పెద్దవాళ్ళయ్యాక మొదటిసారి మీడియా కంట పడ్డారు.

Image Credits : Gulte.com Twitter Video
Kalyan Ram Family : నందమూరి కళ్యాణ్ రామ్ ఓ పక్క హీరోగా, మరో పక్క ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ తో నిర్మాతగా దూసుకెళ్తున్నాడు. కళ్యాణ్ రామ్ భార్య స్వాతి, అతని కొడుకు సూర్య రామ్, కూతురు తారక అద్వైత ఎప్పుడో చిన్నప్పుడు కనపడ్డారు. గతంలో కళ్యాణ్ రామ్ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు పలు సినిమా ఈవెంట్స్ కి, ఫ్యామిలీ ఈవెంట్స్ కి తీసుకొచ్చారు. కానీ వాళ్ళు పెద్దయ్యాక అసలు మీడియా ముందుకు ఎప్పుడూ రాలేదు. బయట కనపడకుండా కూడా జాగ్రత్త పడ్డారు.
అయితే కళ్యాణ్ రామ్ పిల్లలు పెద్దవాళ్ళయ్యాక మొదటిసారి మీడియా కంట పడ్డారు. ఇటీవల దేవర సినిమాతో నిర్మాతగా సక్సెస్ కొట్టిన కళ్యాణ్ రామ్ తాజాగా ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్లారు. కళ్యాణ్ రామ్ అతని భార్య స్వాతి పిల్లలు శౌర్య రామ్, తారక అద్వైతలు కలిసి హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లోకి వెళ్తుంటే అక్కడున్న మీడియా కంట పడ్డారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యామిలీ ఎయిర్ పోర్ట్ విజువల్స్ వైరల్ గా మారాయి.
Also Read : Yashmi Gowda : బిగ్ బాస్‌లో యష్మి పాత లవ్ స్టోరీ రివీల్.. పచ్చబొట్టుతో మోసం..
ఈ వీడియోల్లో కళ్యాణ్ రామ్ కొడుకు, కూతుర్ని చూసి అప్పుడే వీళ్ళు ఇంత పెద్దవాళ్ళైపోయారా అని ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్, నెటిజన్లు. ఇక కళ్యాణ్ రామ్ కొడుకు శౌర్య రామ్ ని చూసి మరో నందమూరి వారసుడు సిద్దమవుతున్నాడు అని కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. మరి శౌర్య కూడా హీరో అవుతాడా లేక భవిష్యత్తులో ఏమవుతాడో చూడాలి. మీరు కూడా కళ్యాణ్ రామ్ పిల్లల్ని చూసేయండి..
#KalyanRam with his wife and kids off for a vacation post #Devara's Success. pic.twitter.com/TivR9WFaqx
— Gulte (@GulteOfficial) October 5, 2024