Yashmi Gowda : బిగ్ బాస్‌లో యష్మి పాత లవ్ స్టోరీ రివీల్.. పచ్చబొట్టుతో మోసం..

యష్మి ఓ ఆసక్తికర సంఘటన తెలిపింది.

Yashmi Gowda : బిగ్ బాస్‌లో యష్మి పాత లవ్ స్టోరీ రివీల్.. పచ్చబొట్టుతో మోసం..

Bigg Boss Contestant Yashmi Gowda Reveals Interesting Story about her Love

Updated On : October 6, 2024 / 7:41 AM IST

Yashmi Gowda : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఐదో వారం చివరికి వచ్చేసింది. ఇప్పటికే అయిదుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవ్వగా ఇవాళ ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి. అలాగే ఈ వారం ఎనిమిది మంది కొత్తవాళ్లు వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఎంట్రీ ఇస్తారని తెలుస్తుంది. ఇక నిన్న శనివారం ఎపిసోడ్ లో వారం అంతా జరిగిన సంఘటనలు గుర్తు చేస్తూ నాగార్జున కంటెస్టెంట్స్ పై ఫైర్ అవ్వడం, మెచ్చుకోవడం జరిగింది.

ఈ క్రమంలో యష్మి కి తండ్రి దగ్గర నుంచి వచ్చిన మెసేజ్ చూపించాలంటే ఏదైనా సీక్రెట్ చెప్పాలన్నాడు నాగార్జున. దీంతో యష్మి ఓ ఆసక్తికర సంఘటన తెలిపింది.

Also Read : Pawan Kalyan – Varun Tej : బాబాయ్ OG కథ నేనే ముందు విన్నాను.. మీ ఊహకు అందదు.. OG సినిమాపై వరుణ్ తేజ్ వ్యాఖ్యలు..

యష్మి మాట్లాడుతూ.. నేను కాలేజీలో ఒకర్ని ప్రేమించాను. నా పేరు, అతని పేరు పచ్చబొట్టు పొడిపించుకోవాలి అనుకున్నాను. కానీ ఈ విషయం ఎవరికీ తెలియకూడదు అనుకోని మా ఇద్దరి పేర్లలో మొదటి అక్షరాలను చైనీస్ భాషలో పచ్చబొట్టు వేయించుకున్నాను. అయితే ఆ తర్వాత అది చైనీస్ భాష కాదు జాపనీస్ భాష అని తెలిసింది. అంతే కాకుండా ఆ అక్షరాలకు అసలు అర్ధమే లేదని తెలిసింది. దీంతో నేను మోసపోయాను అని గ్రహించాను అంటూ తెలిపింది. అయితే ఆ అబ్బాయితో బ్రేకప్ అయినట్టు గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపింది యష్మి. మరి అది యష్మినే చూసి వేయించుకొని మోసపోయిందా? లేక పచ్చబొట్టు వేసేవాళ్ళు మోసం చేసారా క్లారిటీ ఇవ్వలేదు.