Pawan Kalyan – Varun Tej : బాబాయ్ OG కథ నేనే ముందు విన్నాను.. మీ ఊహకు అందదు.. OG సినిమాపై వరుణ్ తేజ్ వ్యాఖ్యలు..
తాజాగా వరుణ్ తేజ్ మట్కా టీజర్ లాంచ్ ఈవెంట్లో OG సినిమా గురించి మాట్లాడాడు.

Varun Tej Interesting Comments on Pawan Kalyan OG Movie
Pawan Kalyan – Varun Tej : పవన్ కళ్యాణ్ OG సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్, సాంగ్స్ తో సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. అయితే పవన్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ఈ సినిమా లేట్ అవుతుంది. త్వరలోనే OG సినిమా షూట్ కి కూడా డేట్స్ ఇస్తారని సమాచారం. ఇప్పటికే OG సినిమా గురించి అందరూ గొప్పగా చెప్తున్నారు.
అయితే తాజాగా వరుణ్ తేజ్ మట్కా టీజర్ లాంచ్ ఈవెంట్లో OG సినిమా గురించి మాట్లాడాడు. వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. మొదట OG సినిమా కథని బాబాయ్ కంటే ముందు నేనే విన్నాను. కచ్చితంగా ఇది పెద్ద హిట్ కొడుతుంది. బాబాయ్ బిజీగా ఉన్నాడు కాబట్టి కొంచెం లేట్ అవ్వొచ్చు. కానీ ఎన్ని రోజులు వెయిట్ చేస్తే దానికి తగ్గ సినిమాగా ఉంటుంది. OG సినిమా మీ ఊహకు అందని విధంగా ఉంటుంది అని చెప్పి ఆ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచారు.
Mega Prince #VarunTej Comments #PawanKalyan On #OG 🔥🔥 #MATKA Teaser Launch Event.#OG #PawanKalyan #Sujeeth pic.twitter.com/26g9PU8u1q
— Natanam (@NatanamNZ) October 5, 2024