Kalyan Ram : ‘డెవిల్’ సినిమా కోసం అప్పటి కాలానివి.. ఏకంగా 90 రకాల డ్రెసులు..

కళ్యాణ్ రామ్ బ్రిటిష్ ఏజెంట్ గా నటిస్తున్న 'డెవిల్' సినిమాలో నందమూరి హీరో ప్రత్యేకంగా డిజైన్ చేయించిన 90 రకాల డ్రెసులు ధరించారట.

Kalyan Ram wore 90 type of unique costumes in Devil movie

Kalyan Ram : టాలీవుడ్ లో ప్రయోగాలు చేసే హీరోల లిస్టులో నందమూరి కళ్యాణ్ రామ్ పేరు ముందుగా చెప్పొచ్చు అనడంలో ఎటువంటి సందేహాలు అవసరం లేదు అనుకుంటా. డిఫరెంట్ కథలని ఎంచుకోవడమే కాదు కొత్త దర్శకులకు ఎక్కువ అవకాశం ఇస్తూ.. రియల్ డైనమిక్ హీరో అనిపించుకుంటున్నారు. తాజాగా ఈ నందమూరి హీరో ‘డెవిల్’ అనే పీరియాడిక్ మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. బ్రిటిష్ రూలింగ్ టైం పీరియడ్ తో ఈ సినిమా కథాంశం ఉండబోతుంది. కళ్యాణ్ రామ్ బ్రిటిస్జ్ సీక్రెట్ ఏజెంట్ గా కనిపించబోతున్నారు.

ఇక బ్రిటిష్ కాలం నాటి కథ కావడంతో ఆ కథాంశానికి తగ్గట్టు అప్పుడు ఉపయోగంలో ఉన్న వస్తువులను, దుస్తువులను ఉపయోగిస్తూ నాటి ప‌రిస్థితుల‌ను ఆవిష్క‌రించేలా సినిమాని తెరకెక్కించారు. ఈక్రమంలోనే కళ్యాణ్ రామ్ పాత్ర డ్రెస్సింగ్ ని స‌రికొత్త‌గా ఉండేలా ద‌ర్శ‌క నిర్మాత అభిషేక్ నామా డిజైన్ చేయించారు. కాస్ట్యూమ్ డిజైన‌ర్ రాజేష్ కళ్యాణ్ రామ్ పాత్రకి కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేశారు.

Also read : Mega156 : ఆసుపత్రిలో కేసీఆర్‌కి మెగా156 అప్డేట్ ఇచ్చిన చిరు..

ఈ కాస్ట్యూమ్ డిజైన్ గురించి రాజేష్ మాట్లాడుతూ.. “నాకు ఈ మూవీ స్క్రిప్ట్ వినగానే ఒక విషయం అర్ధమైంది. ఈ సినిమాలో హీరో లుక్ చాలా డిఫరెంట్ గా ఉండాలని. ఎందుకంటే.. హీరో ఇండియన్ అయినప్పటికీ బ్రిటీష్ ఏజెంట్ గా పనిచేస్తుంటాడు. ఈ రెండు విషయాలను ఎలివేట్ చేసేలా ఆయన కాస్ట్యూమ్స్ డిజైన్ చేయాలని అనుకున్నాను. ఈక్రమంలోనే ఆయన కింద ధోతితో కనిపిస్తూనే పైన కోటుని ధ‌రించి ఉంటారు. అలాగే ఆయ‌న ప్రతి కాస్ట్యూమ్ లో భార‌తీయ‌త క‌నిపించేలా ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకున్నాం” అంటూ వివరించారు.

ఇక ఈ సినిమా కోసం క‌ళ్యాణ్ రామ్ మొత్తం మీద 90 కాస్ట్యూమ్స్‌ను ఉపయోగించారట. కళ్యాణ్ రామ్ ధరించిన బ్లేజ‌ర్స్‌ను ఇట‌లీ నుంచి తెప్పించిన‌ మోహైర్ ఊల్‌ తో ప్ర‌త్యేకంగా తయారు చేయించారట. ఈ బ్లేజ‌ర్ జేబు పక్కన వేలాడుతూ కనిపించేలా ఓ హ్యాంగింగ్ వాచ్‌ని ప్ర‌త్యేకంగా త‌యారు చేయించారట. ఈ వాచ్ లను డిల్లీలో పురాత‌న వాచీల‌ను సేక‌రించే వ్య‌క్తి దగ్గర నుంచి తీసుకు వచ్చారట.

ట్రెండింగ్ వార్తలు