ఇది కదా కమల్, మణిరత్నం అంటే.. ఎంత ఎదిగినా.. ఇలా.. 

ఇక్కడికి వస్తే పుట్టింటికి వచ్చిన అనుభూతి తనలో కలుగుతుందని తెలిపారు.

Kamal Hassan

మణిరత్నం డైరెక్షన్‌లో కమల హాసన్‌ హీరోగా రూపుదిద్దుకున్న ‘థగ్‌ లైఫ్‌’ సినిమా జూన్‌ 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా తాజాగా హైదరాబాద్‌లో ఆ సినిమా యూనిట్ ప్రెస్‌మీట్‌ నిర్వహించింది. ఇందులో కమల హాసన్‌, మణిరత్నం మాట్లాడుతూ తెలుగు నేలంటే ఎంత అభిమానమో చాటుకున్నారు.

కమల్, మణిరత్నం చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల అభిమానులను కట్టిపడేశాయి. వారు ఎంత ఎదిగినా చాలా వినమ్రతతో మాట్లాడారని ఫ్యాన్స్ అంటున్నారు. ఇంతకీ కమల్, మణిరత్నం తెలుగు నేల, తెలుగు ప్రేక్షకుల గురించి ఏమన్నారు?

Kiran Abbavaram : తండ్రి అయిన హీరో కిరణ్‌ అబ్బవరం.. బాబు కాలిని ముద్దాడుతూ.. ఫొటో వైరల్..!

తాను సినిమాను ఎన్నటికీ భుజాలపై మోస్తానని కమల హాసన్ అన్నారు. తాను తెలుగులోనే స్టార్‌గా ఎదిగానని, అందుకు తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్‌ అని చెప్పారు. తనను ద్రోణాచార్యతో పోల్చారని, కానీ, తాను ఎప్పటికీ విద్యార్థినేనని తెలిపారు. తాను ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉన్నానని అన్నారు.

తాను మనసు పెట్టి చేసిన అన్ని సినిమాలు విజయాన్ని సాధించాయని, ‘థగ్‌ లైఫ్‌’ మూవీని కూడా మనసుపెట్టి చేశానని అన్నారు. గొప్ప టీమ్‌తో కలిసి పని చేశానని చెప్పారు. మణిరత్నంతో తాను తీసిన ‘నాయకుడు’ సినిమా కంటే ఈ సినిమా మరింత పెద్ద విజయాన్ని సాధిస్తుందని తెలిపారు.

మరోవైపు, తెలుగు నేల గురించి మణిరత్నం కూడా ప్రత్యేకంగా మాట్లాడారు. తాను ఇక్కడికి వస్తే పుట్టింటికి వచ్చిన అనుభూతి తనలో కలుగుతుందని తెలిపారు. చాలా కాలం తర్వాత కమల హాసన్‌తో సినిమా తీసే అవకాశం వచ్చిందని చెప్పారు. కమల్ డైరెక్టర్‌కి సపోర్ట్‌ చేసే హీరో అని కొనియాడారు. కాగా, ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. ఈ సినిమాపై అంచనాలను పెంచేసింది.