Kiran Abbavaram : తండ్రి అయిన హీరో కిరణ్ అబ్బవరం.. బాబు కాలిని ముద్దాడుతూ.. ఫొటో వైరల్..!
Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం, రహస్య దంపతులు తమ మగబిడ్డకు జన్మనిచ్చారు. పుట్టిన బాబు కాలిని ముద్దాడుతున్న ఫొటోను షేర్ చేశారు.

Kiran Abbavaram
Kiran Abbavaram : టాలీవుడ్ యంగ్ హీరో తండ్రి అయ్యాడు. కిరణ్ అబ్బవరం, రహస్య దంపతులకు మగబిడ్డ జన్మించాడు. ఈ దంపతులు తమ మొదటి బిడ్డను తమ జీవితంలోకి స్వాగతం పలికారు.
Read Also : Realme 14 Pro : అద్భుతమైన డిస్కౌంట్.. రియల్‌మి 14 ప్రో ధర ఎంత తగ్గిందో తెలిస్తే కొనకుండా ఉండలేరు..!
కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్ కొద్దిసేపటిక్రితమే మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ అద్భుతమైన క్షణాన్ని సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్‌తో ఫొటోను షేర్ చేశాడు.
ఈ ఫొటోలో పుట్టిన బాబు కాలిని ముద్దాడుతూ కనిపించాడు. ‘‘హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.. నాకెంతో ఇష్టమైన దేవుడు హనుమంతుడు..
ఆయన జయంతి రోజునే మా ఇంట కొడుకు జన్మించడం చాలా అదృష్టం. స్వయంగా ఆంజనేయుడే మా ఇంటికి వచ్చినట్టు ఉంది’’ అంటూ పోస్టులో పేర్కొన్నాడు.
కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్ తొలి చిత్రం “రాజా వారు రాణి గారు”తో సినీపరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఈ మూవీ షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య పరిచయం కాస్తా ప్రేమగా మారింది.
ఆ తర్వాత పెళ్లికి వరకు వెళ్లింది. గత ఏడాదిలోనే ఇరువురు మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి అనంతరం రహస్య నటనకు దూరంగా ఉండగా, కిరణ్ మాత్రం వరుస సినిమాలు చేస్తున్నాడు.
భార్య రహస్య బేబీ బంప్ ఫొటోలను కూడా కిరణ్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇప్పుడు రహస్య మగబిడ్డకు జన్మనివ్వడంతో ఆ ఫొటోను కూడా అభిమానులతో షేర్ చేస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. రహస్య దంపతులకు పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సైతం శుభాకాంక్షలు తెలుపుతున్నారు.